Begin typing your search above and press return to search.

మహా ట్విస్ట్ : డిప్యూటీ సీఎం అజిత్ రాజీనామా ?

By:  Tupaki Desk   |   26 Nov 2019 9:34 AM GMT
మహా ట్విస్ట్ : డిప్యూటీ సీఎం అజిత్ రాజీనామా ?
X
మహారాష్ట్ర రాజకీయాలలో మరో భారీ ట్విస్ట్. శుక్రవారం వరకు శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అని అనుకున్నారు. కానీ , శనివారం తెల్లవారే సరికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. దీని పై ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన కలసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీకి మెజారిటీ లేదని సుప్రీంకోర్టు‌లో పిటిషన్ వేశాయి. దీని మీద విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఈనెల 27వ తేదీ సాయంత్రం లోపు ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం మొత్త లైవ్ టెలికాస్ట్ చేయాలని, ఎలాంటి రహస్య ఓటింగ్ నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది.

కానీ , సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించిన కొద్దిసేపటికే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. రేపు అసెంబ్లీ లో బల పరీక్ష ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం లో విఫలమైన అజిత్ పవార్ బల పరీక్ష కు ముందే తన పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే అంతకుముందు అజిత్ ని తిరిగి మళ్లీ ఎన్సీపీ లో చేర్చుకోవడానికి పలువురు నేతలతో శరద్ రాయబారం చేసారు. కానీ , అజిత్ వారి మాటలకి లొంగలేదు. ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ భార్య ని రంగంలోకి దించాడు. ఆమె రంగంలోకి దిగిన గంటల వ్యవధిలోనే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఇక అజిత్ నే నమ్ముకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ కి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. అజిత్ రాజీనామా నేపథ్యం లో రేపు జరగబోయే బలపరీక్ష లో ఫడ్నవిస్‌ ప్రభత్వం నెగ్గుకు రావడం దాదాపు అసాధ్యం. దీని తో మరి కాసేపట్లో సీఎం పదవికి ఫడ్నవిస్ కూడా రాజీనామా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.