Begin typing your search above and press return to search.

విజ‌యసాయిరెడ్డి తో మాగుంట భేటీ?...వైసీపీలోకి క‌న్‌ ఫార్మ్‌!

By:  Tupaki Desk   |   19 Feb 2019 10:32 AM GMT
విజ‌యసాయిరెడ్డి తో మాగుంట భేటీ?...వైసీపీలోకి క‌న్‌ ఫార్మ్‌!
X
ఇటు ప్ర‌కాశం జిల్లాతో పాటు అటు నెల్లూరు జిల్లాలోనూ రాజ‌కీయంగా మంచి ప‌ట్టున్న మాగుంట ఫ్యామిలీ టీడీపీకి ఝ‌ల‌క్కిచ్చి వైసీపీలోకి చేరిపోయే విష‌యంలో మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే త‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చినా... ఈ ద‌ఫా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు కావాల్సిందేన‌ని - అంతేకాకుండా త‌న‌కు ఇచ్చే ఎంపీ సీటు ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ త‌న అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేన‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి తేల్చి చెప్పారు. ఈ త‌ర‌హా కొత్త ప్ర‌తిపాద‌నకు కాస్తంత ఇబ్బంది ప‌డ్డ చంద్ర‌బాబు.. పార్టీ నుంచి నేత‌లు చేజారుతున్న త‌రుణంలో చూద్దాం - చేద్దాం అంటూ స్ప‌ష్ట‌మైన హామీని దాట‌వేశారంట‌.

దీంతో ఇక్క‌డ ప‌నికాద‌నుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ... మాగుంట వైసీపీలోకి చేరిపోయేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లండ‌న్ టూర్ ముగియ‌గానే... ఈ నెల 28న జ‌గ‌న్ తో భేటీ కావ‌డం - ఆ త‌ర్వాత మార్చి 1న వైసీపీలోకి చేరాల‌ని మాగుంట నిర్ణ‌యించుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. లోట‌స్ పాండ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు... ఇప్ప‌టికే నిన్న రాత్రి చెన్నై నుంచి హైద‌రాబాదుకు వెళ్లిన మాగుంట‌... వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌యసాయిరెడ్డితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యార‌ట‌. పార్టీలో చేరితే త‌న‌కు ద‌క్కే ప్రాధాన్యంపై మాగుంట కాస్తంత ఓపెన్‌ గానే మాట్లాడిన‌ట్టుగా స‌మాచారం.

అయితే మాగుంట అడిగిన అన్న ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గానే స‌మాధానం ఇచ్చిన విజ‌యసాయిరెడ్డి... అభ్య‌ర్థుల విష‌యంలోనూ గెపులు గుర్రాల‌కు సీటిస్తే ఓకే క‌దా అంటూ మాగుంట‌ను సంతృప్తి ప‌రిచార‌ట‌. గెలుపే ల‌క్ష్యంగా వెళుతున్న త‌న‌కు గెలిచే అభ్య‌ర్థుల‌నే బ‌రిలో నిలిపితే... త‌న‌కేమీ ఇబ్బంది లేద‌ని కూడా మాగుంట బ‌దులిచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ‌లు సానుకూల వాతావ‌ర‌ణంలోనే జ‌రిగిన నేప‌థ్యంలో జ‌గ‌న్ లండ‌న్ టూర్ ముగించుకుని వ‌చ్చిన వెంట‌నే పార్టీలో చేరిపోయేందుకు మాగుంట సిద్ధ‌మైపోయార‌ట‌. విజ‌యసాయిరెడ్డితో భేటీ త‌ర్వాత ఈ నెల 28న జ‌గ‌న్ తో భేటీ - ఆ త‌ర్వాత మార్చి 1న పార్టీలో చేరాల‌నుకున్న నిర్ణ‌యాన్ని కాస్తంత మార్చేసుకున్న మాగుంట‌... ఈ నెల 28నే ఏకంగా పార్టీలోనే చేరిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా లోట‌స్ పాండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.