Begin typing your search above and press return to search.

సరికొత్త రూపులో వచ్చేస్తోంది 2 మినిట్ మ్యాగీ

By:  Tupaki Desk   |   5 Nov 2015 4:39 AM GMT
సరికొత్త రూపులో వచ్చేస్తోంది 2 మినిట్ మ్యాగీ
X
కొద్ది నెలల క్రితం రెండు నిమిషాల మ్యాగీ న్యూడిల్స్ నాణ్యత మీద వెల్లువెత్తిన సందేహాల నేపథ్యంలో.. ల్యాబరేటరీల్లో పరీక్షలు నిర్వహించి లోపాలు ఉన్నట్లు గుర్తించి దేశ వ్యాప్తంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నిమిషాల ఫాస్ట్ ఫుడ్ గా సుపరిచితమైన మ్యాగీ.. దేశ వ్యాప్తంగా కనుమరుగైంది. ఇది .. మ్యాగీని ఉత్పత్తి చేసే నెస్లేకు భారీగా ఆర్థిక నష్టాన్ని కలిగించింది కూడా.

తమ ఉత్పత్తుల్లో నాణ్యత మీద మళ్లీ దృష్టి సారించిన నెస్లే.. మ్యాగీని రీ లాంచ్ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధమైంది. తొలుత తాను తయారు చేసిన కొత్త న్యూడిల్స్ ను దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ల్యాబ్ లలో పరీక్షించి అక్కడ నుంచి సానుకూల నివేదికలు పొందిన తర్వాత.. బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

అనంతరం అక్కడి నుంచి పొందిన సానుకూల ఆదేశాల నేపథ్యంలో ఇతన అనుమతులు పొందే అంశంపై తాజాగా దృష్టి పెట్టింది. అన్నీ అనుకున్నట్లు సాగితే డిసెంబరులో నెస్లే తన తాజా మ్యాగీ నూడుల్స్ ను సరికొత్తగా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ల్యాబ్ లలో తమ ఉత్పత్తుల్ని పరీక్షిస్తే నాణ్యత పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని తేలినట్లుగా నెస్లే పేర్కొన్న నేపథ్యంలో.. మార్కెట్ లోకి రీఎంట్రీకి నెస్లే ఉత్సాహంగా ఉంది. మరి.. రీ ఎంట్రీని భారతీయులు ఎంతమేరకు స్వాగతిస్తారో చూడాలి.