Begin typing your search above and press return to search.

డ్యాన్సర్లతో స్టెప్పులేసిన టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   17 Jan 2017 7:56 AM GMT
డ్యాన్సర్లతో స్టెప్పులేసిన టీడీపీ ఎంపీ
X
ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కాస్తంత హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. సరదాగా ఉండటం తప్పేం కాదు.. కానీ దానికి ఒక హద్దుపొద్దు అన్నది ఉంటుంది కదా. ఎంపీగా ఉన్న వ్యక్తి రికార్డింగ్ డ్యాన్సుల్లో.. డ్యాన్సర్లతో చిందులేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏపీ అధికారపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు ఎంపీ మాగంటిబాబు డ్యాన్స్ యవ్వారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సంక్రాంతి పండగ సందర్భంగా ఆయన కైకలూరులోని తన స్వగృహంలో పార్టీ నేతలకు.. సన్నిహితులకు భారీ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విందులో కోరుకున్న వారికి కోరుకున్న నాన్ వెజ్ ను వడ్డించటమే కాదు.. ఖరీదైన బ్రాండ్ల మద్యాన్ని అందించటం కనిపించింది. ఇక.. యాంకర్లతో కలిసి ఎంపీగారు చేసిన డ్యాన్సులు అందరూ వింతగా చూసేలా చేశాయి.

సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అందరికి ఆదర్శప్రాయుడిగా ఉండాల్సిన వ్యక్తి.. వీలైనంత హుందగా ఉండాల్సిన అవసరముంది. పండగ పేరుతో భారీ విందులు నిర్వహించి ఈ టీడీపీ ఎంపీ యవ్వారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పలువురు వేలెత్తి చూపించేలా ఉండటం గమనార్హం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/