Begin typing your search above and press return to search.

ఆడ, మగ ఇద్దరు తాళం వేసిన ఇంట్లో ఉంటే..మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు!

By:  Tupaki Desk   |   4 Feb 2021 5:40 PM IST
ఆడ, మగ ఇద్దరు తాళం వేసిన ఇంట్లో ఉంటే..మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు!
X
చెన్నై హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. ఆడ, మగ ఇద్దరు కలిసి తాళం వేసిన ఇంట్లో లేదా గదిలో ఉంటే , వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. 1998లో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. కే శరవణ బాబు అనే సాయుధ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ తన క్వార్టర్‌లో మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉండటాన్ని అధికారులు తప్పు పట్టారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉందని.. అందుకే తలుపులు వేసుకుని ఇద్దరు లోపల ఉన్నారని ఆరోపించారు. ఇక ఇలాంటి చర్యలకు పాల్పడినందకు గాను అతడిని విధుల నుంచి తొలగించారు.

దీనితో శరవణ బాబు కోర్టును మెట్లు ఎక్కాడు. అయితే దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు నిందితుడి వాదనతో ఏకీభవించి ఈ తీర్పును వెల్లడించింది. సమాజంలోని ఊహాతీత కథనాలను ఆధారంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలు విధించడం..విధుల నుంచి తొలగించడం సరైనది కాదు. ఇక ఈ కేసులో నిందితుడు శరవణ బాబు తన నివాసంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ తో ఉన్నాడు. అంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని తేల్చేసింది.
అంతేకాక నిందితుడి వాదనతో ఏకీభవించిన హై కోర్టు ఇద్దరు కానిస్టేబుల్స్‌ని అభ్యంతరకర స్థితిలో చూసినట్లు ఒక్క ప్రతక్ష్య సాక్షి గాని.. మరే ఇతర ఆధారాలు గాని లేవని స్పష్టం చేసింది. ఆ తర్వాత శరవణ బాబు మాట్లాడుతూ.. సదరు మహిళా కానిస్టేబుల్‌ నివాసం మా క్వార్టర్స్‌ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒకరోజు ఆమె ఇంటి తాళం కోసం నా నివాసానికి వచ్చింది. అప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా, ఎవరో తలుపు లాక్‌ చేశారు. మేము తలుపులు వేసుకొని ఏదో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు భావించిన ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తట్టారని తెలిపాడు.