Begin typing your search above and press return to search.

సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   17 Dec 2020 2:10 PM IST
సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X
సీబీఐ... కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఫేవర్ గా ఉంటుందన్న విమర్శ ఉంది. ఇప్పటికీ ప్రభుత్వాలు సీబీఐని కీలుబొమ్మగా ఆడిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థపై తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

సీబీఐ కేసుల్లో నేరారోపణ తక్కువగా ఉందని.. అనేక కేసులలో శిక్ష రేటు చాలా తక్కువగా ఉందని మద్రాస్ హైకోర్టు దుయ్యబట్టింది. చూస్తుంటే దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను కోల్పోతున్నట్టుగా కనిపిస్తోందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

సీబీఐ కేసుల్లో చాలా మంది వైట్ కాలర్ నేరస్థులు తప్పించుకుంటున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా ఎందుకు జరుగుతోందని సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ అధికారులు సేకరించే సాక్ష్యాలు సరిపోవడం లేదని.. ఇంతటి దుస్థితి సీబీఐకి రాకూడదని హైకోర్టు పేర్కొంది.

నేరస్థులను బుక్ చేయడానికి, వారిని దోషులుగా నిరూపించడానికి కావలసిన ఆధారాలను సేకరించడానికి దేశంలో సీబీఐనే సమర్థవంతంగా పనిచేసే నిపుణుల ఏజెన్సీ అని దేశ ప్రజలందరూ నమ్ముతారని కోర్టు అభిప్రాయపడింది. కానీ అనేక కేసుల్లో సీబీఐదే తప్పు అని తేలిందని పేర్కొంది. దర్యాప్తునకు అవసరమైన నైపుణ్యం సీబీఐ అధికారులకు ఉందా అని ప్రశ్నించింది.

బ్యాంక్ మోసాలు, ఇతర వైట్ కాలర్ నేరాలపై దర్యాప్తు చేయడానికి సీబీఐ అధికారులకు ప్రావీణ్యం లేదని విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.