Begin typing your search above and press return to search.

రాముల‌మ్మ‌కు మ‌ద్రాస్ హైకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   18 Sep 2017 6:34 AM GMT
రాముల‌మ్మ‌కు మ‌ద్రాస్ హైకోర్టు నోటీసులు
X
సీనియ‌ర్ న‌టి క‌మ్ రాజ‌కీయ నేత రాముల‌మ్మ‌కు మ‌ద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక వివాదంలో ఆమె నోటీసులు అందుకున్నారు. ఆమెకు చెందిన స్థిరాస్తి విష‌యంలో నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో మ‌ద్రాసు హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసి కోర్టుకు స్వ‌యంగా హాజ‌రు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

విజ‌య‌శాంతి కోర్టుకు హాజ‌రు కావాల్సిన ప‌రిస్థితుల్లోకి వెళితే.. 2006లో విజ‌య‌శాంతికి చెందిన ఆస్తులు చెన్నైలోని ఎగ్మూర్ లో తాను కొనుగోలు చేసిన‌ట్లు ఇంద‌ర్ చంద్ అనే వ్య‌క్తి పేర్కొన్నారు. రూ.5.20 కోట్ల‌కు తాను విజ‌య‌శాంతి ఆస్తుల్ని కొనుగోలు చేసి.. రూ.4.68 కోట్లు అందిచాన‌న్నారు. ఇందుకు సంబంధించిన ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ప‌త్రాల్ని పొందిన‌ట్లుగా పేర్కొన్నారు.

అయితే.. ఇప్పుడా ఆస్తుల్ని విజ‌య‌శాంతి మ‌రొక‌రికి విక్ర‌యించిన‌ట్లుగా పేర్కొన్నారు. దీంతో.. ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స్థానిక జార్జ్ టౌన్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. అయితే.. ఈ పిటీష‌న్‌ను స‌ద‌రు కోర్టు కొట్టివేసింది. ఈ నేప‌థ్యంలో మ‌ద్రాసు హైకోర్టును ఆయ‌న ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ పిటీష‌న్‌ను విచారించిన మ‌ద్రాసు హైకోర్టు.. వివాదాన్ని సామ‌ర‌స్యంగా చ‌ర్చించి ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. విచార‌ణ‌ను ఈ రోజు (సోమ‌వారానికి) కు వాయిదా వేశారు. ఈ రోజు విజ‌య‌శాంతి కోర్టుకు స్వ‌యంగా హాజ‌రు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.