Begin typing your search above and press return to search.
రానా, కోహ్లీ, ప్రకాష్ రాజ్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు
By: Tupaki Desk | 3 Nov 2020 9:40 PM ISTమద్రాస్ హైకోర్టు తాజాగా సెలెబ్రెటీలకు నోటీసులు జారీ చేసి షాకిచ్చింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పై ఈ నోటీసులు జారీ చేసింది. ఇందులో సినీ ప్రముఖులు, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఉన్నారు.
ఈ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుబాటి రానా, సుదీప్, ప్రకాష్ రాజ్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈనెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ పై మద్రాస్ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ లో వందలాది మంది డబ్బులు పోగొట్టుకున్నారని పిటీషన్ తెలిపాడు.
విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలెబ్రెటీలకు నోటీసులు అందించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈనెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.