Begin typing your search above and press return to search.

హైకోర్టు ఆదేశాలు... జయ పరిస్థితి చెప్పండి!

By:  Tupaki Desk   |   4 Oct 2016 6:42 AM GMT
హైకోర్టు ఆదేశాలు... జయ పరిస్థితి చెప్పండి!
X
జ్వరంతోపాటు డీహైడ్రేషన్ కారణంగా సెప్టెంబర్ 22న జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచీ ఇప్పటివరకూ ఆమె దర్శనం ప్రజలకు దొరకలేదు. ఆమె ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాలు నిన్న మొన్నటివరకూ అసలు వెలుగులోకి రాలేదు. దీంతో ఎవరికి తోచిన పుకార్లు వారు సృషిటించేశారు. దీంతో గత నిన్నటినుంచి కాస్త హెల్త్ బులిటెన్స్ విడుదల చేస్తుంది చెన్నైలోని అపోలో ఆస్పత్రి. ఈ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత ఆరోగ్యంపై వైద్యులు వెంటనే వైద్య నివేదికను విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేసేలా ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు వెంటనే స్పందించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య విషయంలో ఆందోళన మొదలైనప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం ఆస్పత్రి కనీస బాధ్యత అంటూ అపోలో ఆస్పత్రి వైద్యులకు కోర్టు ఆదేశాలు జారిచేసింది. సీఎం జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ సోమవారం మద్రాస్ హైకోర్టులో సామాజిక కార్యకర్త "ట్రాఫిక్" రామస్వామి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన కోర్టు ఈ మేరకు అపోలోకు ఆదేశాలు జారీచేసింది.

కాగా అమ్మ ఆరోగ్యంపై ఒకపక్క ఆందోళన కొనసాగుతుండటంతో మరోపక్క ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె ఆరోగ్యం కోసం రకరకాల రీతుల్లో పూజలు, ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఆమె సత్వరమే కోలుకోవాలని చిన్నా పెద్ద తేడాలేకుండా ఎవరి స్థాయిలో వారు వినూత్న రీతుల్లో పూజలు చేస్తున్నారు. అలాగే గత రెండు రోజుల క్రితం జయలలితను ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌ రావు పరామర్శించారు. జయలలిత కోలుకుంటున్నారని, ఆమెకు అందుతున్న వైద్య సేవల పట్ల సంతృప్తిగా ఉందని రాజ్‌భవన్ నుంచి విడుదలైన ప్రకటనలో గవర్నర్ విద్యాసాగర్ రావు పేర్కొన్న సంగతి తెలిసిందే!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/