Begin typing your search above and press return to search.

ప్రాణాలు తీసిన ఆర్భాటపు హోర్డింగ్ కు శిక్ష ఇదేనా?

By:  Tupaki Desk   |   14 Sep 2019 7:13 AM GMT
ప్రాణాలు తీసిన ఆర్భాటపు హోర్డింగ్ కు శిక్ష ఇదేనా?
X
కొద్ది నెలల చోటు చేసుకున్న ఉదంతమిది. పెళ్లి వేడుక కోసం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ కారణంగా ఒక నిండు ప్రాణం పోయిన ఉదంతమిది. తన దారిన తాను పోతున్న ఒక ఐటీ ఉద్యోగిని ప్రాణాల్ని తీసిందో హోర్డింగ్. అప్పట్లోఈ ఉదంతం సంచలనమైంది. చెన్నైలోని క్రోంపేటలోని మీడియన్ లో అన్నాడీఎంకు చెందిన నేత ఇంట్లో వివాహం జరుగుతోంది.

తన స్థాయికి తగ్గట్లు.. గొప్పలు చూపించుకోవటం కోసం నిబంధనలకు విరుద్ధంగా ఒక భారీ హోర్డింగ్ ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. ఐటీ ఉద్యోగిని 23 ఏళ్ల శుభశ్రీ స్కూటీ మీద వెళుతోంది. ఆ సమయంలోనే ఉన్నపళంగా హోర్డింగ్ కూలి.. ఆమె మీద పడింది.

హోర్డింగ్ లో ఆమె చిక్కుకొని ఉన్న వేళలోనే.. వేగంగా వచ్చిన వాహనం ఒకటి ఆమెను ఢీ కొనటంతో అక్కడిక్కడే ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఉదంతంపై విచారించిన మద్రాస్ హైకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. హోర్డింగ్ కూలి ప్రాణాలు కోల్పోయిన ఐటీ ఉద్యోగిని కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇవ్వాల్సిందిగా తేల్చారు. ట్విస్ట్ ఏమంటే.. కోర్టు ఆదేశించిన జరిమానాను.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల జీతాల్లో నుంచి తీసి ఇవ్వాలని ఆదేశించారు.