Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

By:  Tupaki Desk   |   6 Jun 2017 4:38 AM GMT
వెంక‌య్య‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం
X
లోక్ స‌భా స్పీక‌ర్‌.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. కేంద్ర‌మంత్రి.. ప‌లువురు రాష్ట్ర మంత్రులు.. ఉన్న‌త అధికారులు పాల్గొంటున్న స‌భ అంటే ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? కానీ.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్ లో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో ఇలాంటివేమీ తీసుకున్న‌ట్లుగా క‌నిపించ‌లేదు. అర‌కొర ఏర్పాట్లు.. నాసిర‌క‌పు ప‌నుల కార‌ణంగా.. పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. భారీ న‌ష్టం వాటిల్లేది. పూడ్చ‌లేని దారుణం జ‌రిగి ఉండేది. ఇంత‌కీ జ‌రిగిందేమంటే..

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఇండోర్‌ లో ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌.. మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడుతో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. అయితే.. కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలో భారీ వ‌ర్షం కురిసింది.

దీంతో..వేదిక ఒక్క‌సారిగా కూలిపోయింది. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో అక్క‌డున్న ప్ర‌ముఖులు ఒక్క‌సారి షాక్ తిన్నారు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. ప‌లువురు ప్ర‌ముఖులు ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకునే వారు. అదృష్ట‌వ‌శాత్తు ప్ర‌ముఖుల‌కు ఎవ‌రికీ ఏమీ కాలేదు. కానీ.. ఈ ప్ర‌మాదంలో 20 మంది గాయ‌ప‌డ్డారు. ప్ర‌ముఖుల‌కు ఏమీ కాక‌పోవ‌టంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి హుటాహుటిన త‌ర‌లించారు. అయినా.. ఇంత పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్న కార్య‌క్ర‌మానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఇంత నాసిర‌కంగా ఉండ‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/