Begin typing your search above and press return to search.

హనీట్రాప్ లో అదరిపోయే వాస్తవాలు!

By:  Tupaki Desk   |   30 Sept 2019 10:25 AM IST
హనీట్రాప్ లో అదరిపోయే వాస్తవాలు!
X
రాజకీయ.. కార్పొరేట్.. ప్రభుత్వ రంగాల్లోని ప్రముఖుల్ని టార్గెట్ చేసి.. అందమైన మహిళల్ని ఎర వేసి.. రహస్య వీడియోల్ని చిత్రీకరించటం.. వాటితో బ్లాక్ మొయిల్ చేసిన వైనం తాజాగా మధ్యప్రదేశ్ లో సంచలనంగా మారటమే కాదు.. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. హనీట్రాప్ లో పడిన వారిలో హేమాహేమీలు ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా.. ఈ హనీట్రాప్ లో చిక్కుకుపోయిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఉండటం సంచలనంగా మారింది. అయితే.. అత్యంత ప్రముఖులతో జరిపే రాసలీల్ని వీడియో తీసేందుకు కళ్లద్దాలు.. లిప్ స్టిక్ లలో ఉంచిన రహస్య కెమేరాలతో పని పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సెక్స్ స్కాండల్ కు సంబంధించి ఇప్పటికే కొందరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

వీరి నుంచి పెద్ద ఎత్తున స్పై కెమేరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఒక యువతితో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు చేసిన రాసలీలల వీడియో ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ గా మారింది. అదొక్కటే కాదు.. ఓ హిందుత్వ సంస్థకు చెందిన నేతకు అత్యంత సన్నిహితుడైన పెద్దాయనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చాయి.

అయితే.. ఈ వీడియోలు అసలైనవా? నకిలీవా? అన్నది తేలాల్సి ఉంది. కొందరు మధ్యతరగతి అమ్మాయిల్ని ఎర వేసి.. పలు రంగాలకు చెందిన ప్రముఖుల్ని ముగ్గులోకి దించి.. వారితో రాసలీలలు చేస్తున్న వేళ.. ఆ వ్యవహారాన్ని గుట్టుగా చిత్రీకరించటం.. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్ మొయిల్ చేస్తూ.. తమకు అవసరమైన పనుల్ని చేయించుకున్న వైనం బయటకు వచ్చి ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ భారీ స్కాంకు సంబంధించి ఇప్పటికే బహిర్గతమైన వివరాలకు తోడుగా బయటకు వస్తున్న వీడియోలతో కలకలం మరింత పెరుగుతోంది. పోలీసుల విచారణలోనూ షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి.

ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయటమే కాదు.. ఈ వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్తి దయాల్.. మోనిక యాదవ్.. శ్వేత విజయ్ జైన్.. శ్వేత స్వప్నిల్ జైన్.. బర్ఖా సోని.. ఓం ప్రకాశ్ కోరిలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరి నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖుల శృంగార వీడియోల్ని.. ఆడియో క్లిప్పుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో మరెన్ని సంచలన అంశాలు బయటకు రానున్నాయో చూడాలి.