Begin typing your search above and press return to search.

బీజేపీ స‌ర్కార్ ఆర్థిక సంవ‌త్స‌రాన్నే మార్చేసింది

By:  Tupaki Desk   |   5 May 2017 8:04 AM GMT
బీజేపీ స‌ర్కార్ ఆర్థిక సంవ‌త్స‌రాన్నే మార్చేసింది
X
సాధార‌ణంగా ఆర్థిక సంవ‌త్సరం అంటే ఏప్రిల్-మార్చి వ్యవధిని పరిగణిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌న‌దేశంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇదే థియ‌రీని ఫాలో అవుతున్నారు. కానీ బీజేపీ సార‌థ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ ఆర్థిక సంవత్సరాన్ని మార్చేసింది. ఆర్థిక సంవత్సరంగా ఏప్రిల్-మార్చి వ్యవధిని కాకుండా క్యాలెండ‌ర్ సంవ‌త్స‌రం వ‌లే జనవరి-డిసెంబర్‌ ను ఫాలో అవుతామ‌ని ప్రకటించింది.

మధ్యప్రదేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అనుమ‌తి మేర‌కు ఈ ఏడాది డిసెంబర్‌ లో బడ్జెట్ ప్రవేశపెడతామని, జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తెలియజేసింది. నిజానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఆర్థిక సంవత్సరాన్ని జనవరి-డిసెంబర్‌గా చేయాలని భావిస్తున్నట్లు తొలుత ప్రకటించారు. ప్ర‌ధాన‌మంత్రి సార‌థ్యంలోని నీతి ఆయోగ్‌లో దీనిపై ఇటీవల చర్చ కూడా జరగిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించి అంద‌రికంటే ముందంజ‌లో నిలిచిన‌ట్ల‌యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/