Begin typing your search above and press return to search.

సిగ్గు చేటు.. స్కూల్‌ విద్యార్థినిపై పోలీస్‌ కీచకపర్వం

By:  Tupaki Desk   |   9 March 2023 11:40 PM IST
సిగ్గు చేటు.. స్కూల్‌ విద్యార్థినిపై పోలీస్‌ కీచకపర్వం
X
అర్థరాత్రి సమయంలో కూడా రోడ్డుపై మహిళలు ధైర్యంగా నడుస్తున్నారంటే కచ్చితంగా అది పోలీసులు ఉన్నారనే ధైర్యం. రాత్రి సమయంలో కూడా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ తమకు రక్షణ కలిగిస్తారనే నమ్మకంతో మహిళలు రోడ్డుపై నడుస్తూ ఉంటారు. కానీ పోలీసులే దారుణంగా ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి.. మధ్య ప్రదేశ్‌ లో అదే జరిగింది.

మధ్య ప్రదేశ్‌ భోపాల్ లో ఒక పోలీస్‌ బైక్ పై వెళ్తూ.. రోడ్డు మీద నడుస్తున్న అమ్మాయికి అడ్డంగా బైక్‌ ఆపాడు. ఆమెను ఇష్టానుసారంగా టచ్ చేస్తూ ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ విద్యార్థిని తప్పించుకునేందుకు ప్రయత్నించినా కూడా బలవంతంగా ఆమెపై లైంగిక దాడి చేశాడు.

ఈ సంఘటన మొత్తాన్ని కూడా దూరం నుండి ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ విషయాన్ని కూడా పోలీస్‌ పట్టించుకోకుండా విద్యార్థిపై లైంగిక దాడిని కంటిన్యూ చేయడం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి రక్షణ కల్పించాల్సింది పోయి తానే కీచకుడిగా మారిన వైనం ప్రస్తుతం విమర్శలకు తెర తీస్తోంది. విద్యార్థినిని లైంగికంగా వేధించిన పోలీస్ పై చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.