Begin typing your search above and press return to search.

దుబ్బాకలో ఓటమిపై కాంగ్రెస్ నేత అడ్డుగోలు వాదన

By:  Tupaki Desk   |   11 Nov 2020 12:30 AM GMT
దుబ్బాకలో  ఓటమిపై  కాంగ్రెస్ నేత అడ్డుగోలు వాదన
X
దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిందంటే మూడో స్ధానంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. మొదటి నుండి పోటీలో నువ్వా నేనా అన్నట్లుగా పోటి పడిన టీఆర్ఎస్, బీజీపీ అభ్యర్ధుల్లో విజయం ఎవరిదనే విషయంలో తీవ్ర ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తు చివరకు బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు గెలిచారు. బీజేపీ గెలుపు టీఆర్ఎస్ నేతలను ప్రధానంగా కేసీయార్, హరీష్ రావు లాంటి వాళ్ళకి మింగుడుపడనిదే అని చెప్పాలి.

తమ అభ్యర్ధికి లక్ష ఓట్లు వస్తాయని ఉపఎన్నిక మొదటి నుండి చెప్పుకుంటున్న నేపధ్యంలో 1160 ఓట్లతో ఓడిపోవటమంటే మామూలు షాక్ కాదు. సరే ఏ దశలో కూడా ఏమాత్రం పోటి ఇవ్వలేని కాంగ్రెస్ అభ్యర్ధి చెఱకు శ్రీనివాసరెడ్డికి కూడా సుమారు 22 వేల ఓట్లొచ్చాయి. నిజానికి ఇన్ని ఓట్లు రావటమే గొప్ప. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ మాత్రం విచిత్రమైన వాదన మొదలుపెట్టారు. తమ పార్టీ మీద జనాల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

అసలు ప్రజల వ్యతిరేకత అన్నది అధికార పార్టీ మీదుంటుంది కాని ప్రతిపక్షంలోని పార్టీల మీద ఎందుకంటుంది ? ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పటం వరకు నిజమే. టీఆర్ఎస్ పై జనాల్లో ఇంత స్ధాయిలోవ్యతిరేకత ఉంది కాబట్టే తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్నది నిజమే అయితే అదే వ్యతిరేక కాంగ్రెస్ కు కాకుండా బీజేపీకి మాత్రమే ఎందుకు లాభించింది ? పోటీలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఉన్నపుడు గెలుపోటములు బీజేపీ-కాంగ్రెస్ మధ్యే ఉండాలి కదా ?

తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని జనాలు ఓ దేవతగా చూస్తున్నారని చెప్పటం పెద్ద జోక్. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెసే అయినా దాన్ని సాధించిన కేసీయార్ నే జనాలు గుర్తు పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ ను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎలాగంటే నిజంగానే ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లే వచ్చిందని జనాలు అనుకుంటే 2014, 2019లో ఎందుకు ఓడిగొట్టారో గౌడ్ సమాధానం చెప్పగలరా ? పైగా బీజేపీకి జనాలు ఓట్లేయటం వెనుక స్ధానికతే ప్రధాన కారణమని చెప్పటం మరీ విడ్డూరంగా ఉంది.

ఇక మరో సీనియర్ నేత విహెచ్ అయితే అభ్యర్ధి ఎంపికలోనే లోపాలున్నాయంటూ మండిపడ్డారు. స్ధానికుడైన రఘునందనరావు ప్రచారంలో ముందుండటమే కారణంగా చెప్పారు. పార్ట జెండా మోసిన వారికి కాకుండా పార్టీలు మారే వారికే టికెట్ ఇవ్వటం వల్లే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతోందన్నారు. నిజానికి టీఆర్ఎస్ ను ఓడగొట్టడంలో బీజేపీ నేతల్లోని టీం వర్కు కాంగ్రెస్ నేతల్లో లేదన్నది అసలు వాస్తవం. దాన్ని మాత్రం ఎవరు ఒప్పుకోవటం లేదు.