Begin typing your search above and press return to search.

టీపీసీసీ చీఫ్ పై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   6 Nov 2020 3:50 PM GMT
టీపీసీసీ చీఫ్ పై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X
టీపీసీసీలో ముసలం మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిందేనంటూ నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ గళం వినిపించారు. ఈ మేరకు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి.

మాజీ ఎంపీ మధుయాష్కి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే టీపీసీసీ నాయకత్వ మార్పు అవసరమన్నారు. ఐదేళ్లుగా పీసీసీ చీఫ్ గా ఒకే వ్యక్తి ఉన్నారని.. ఆయన హయాంలో చాలా ఓటములు ఎదురయ్యాయని.. ఆయన పోటీచేసిన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మధుయాష్కీ తెలిపారు.

దుబ్బాక ఫలితం తరువాత పరిస్థితులు ఎలా ఉన్నా నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచించారని చెప్పారు. నాయకత్వంలో మార్పుతోనే పార్టీకి కొత్త రక్తం ఊపిరి వస్తుందని.. అప్పుడే పార్టీ పోరాడగలదని అన్నారు.

పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ అలాగే ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ తమ రిపోర్టులు జాతీయ పార్టీకి అందిస్తారన్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీల్లో మార్పులు ఉండవచ్చని ఆయన తెలిపారు. త్వరలోనే హైకమాండ్ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.