Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ రాజకీయం - మధుయాష్కీ కారు ఫసక్ !
By: Tupaki Desk | 7 Dec 2018 10:54 AM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. పోలింగ్ హడావుడి రాష్ట్రమంతా నడుస్తోంది. అయితే నిన్న రాత్రి ... కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తనకు సంబంధం లేని కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలే ఆయనపై తిరగబడ్డారు.
మెట్‌పల్లిలోని ఓ డాక్టర్ ఇంటికి వచ్చిన మధును కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ప్రశాంత వాతావరణం కాస్తా చెదిరిపోయింది. ఆయన కారుపై దాడి చేశారు. అద్దాలు పగిలిపోయాయి. అంతకుముందు ఆందోళనకారులంతా ఆయన వద్దకు నిరసన ధర్నా చేపట్టారు. వాళ్ల ప్రధాన ఆగ్రహం ఏంటంటే... కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములుకు టికెట్ రాకుండా మధు యాష్కీ అడ్డుకున్నారట. మధు అడ్డుకోకపోతే ఆయనకు టిక్కెట్ వచ్చేదని వారు అంటున్నారు. కక్షతో ఎదురుచూస్తున్న కొమ్మిరెడ్డి అనుచరులు నిన్న మధు తమకు పట్టున్న ప్రాంతంలో దొరకడంతో కారుపై దాడిచేశారు.
మరోవైపు స్థానికేతరుడు అయిన మధు ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉండడంపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇదే కాదు... తెలంగాణలోని పోలింగ్ జరుగుతున్న చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.