Begin typing your search above and press return to search.

ఎవరీ ‘చింగారీ’.. ఎందుకంత సంచలనం?

By:  Tupaki Desk   |   24 Jun 2020 9:00 PM IST
ఎవరీ ‘చింగారీ’.. ఎందుకంత సంచలనం?
X
3 రోజుల్లో 5 లక్షల డౌన్ లోడ్లతో రచ్చ చేస్తున్న చింగారీ లేదా ఎవరీ చింగారీ? అంతలా ఎందుకు చెలరేగి పోతోంది? టిక్ టాక్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరమే లేదు. సుపరిచితమైన ఈ యాప్ కు ప్రత్యామ్నాయం గా ఇప్పటికే కొన్నియాప్ లు వచ్చినా.. అవేమీ చింగారీ ముందు తేలిపోతున్నట్లు చెబుతున్నారు. అనుకోని రీతిలో టైం కూడా కలిసి రావటం చింగారీ సుడి తిరిగి పోయింది. టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ యాప్ కు విశేష ఆదరణ లభిస్తోందట. కేవలం మూడురోజుల వ్యవధిలో 5 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని చెబుతున్నారు.

గల్వాన్ ఉదంతం తర్వాత చైనా వస్తువుల వినియోగం మీద ఆసక్తి తగ్గుతోంది. అంతేకాదు.. ఎవరికి వారుతమ మొబైల్ ఫోన్లో ఉన్న చైనా యాప్ ల్ని అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో చంటిగాడు లోకల్ అన్నట్లుగా దూసుకొచ్చిన చింగారీకి ఇప్పుడు చక్కటి ప్రాచుర్యం లభిస్తోంది. దాన్ని క్రియేట్ చేసిన బిస్వాత్మా.. సిద్దార్థ్ లు.. తమ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ట్రెండింగ్ లో ఉందని చెబుతున్నారు. కేవలం 72 గంటల్లో 5 లక్షల డౌన్ లోడ్లు చేసుకున్నట్లు వెల్లడించారు. చింగారీ స్పెషాలిటీ ఏమంటే.. ఈ యాప్ లో అప్ లోడ్చేసిన వీడియోలకు వీక్షకుల సంఖ్య ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. అందుకు అనుగుణంగా డబ్బులు కూడా సంపాదించొచ్చని చెప్పటం కూడా చింగారీ చెలరేగిపోవటానికి మరో కారణంగా చెబుతున్నారు.