Begin typing your search above and press return to search.

ఆ స్విచ్‌ ను ఒకేసారి నొక్కిన మోడీ.. ఇవాంక‌

By:  Tupaki Desk   |   29 Nov 2017 4:11 AM GMT
ఆ స్విచ్‌ ను ఒకేసారి నొక్కిన మోడీ.. ఇవాంక‌
X
జీఈఎస్ సంద‌డి మా జోరుగా సాగుతోంది. స‌ద‌స్సు మొద‌లైన తొలిరోజు హడావుడి అద‌ర‌హో అన్న‌ట్లుగా మారింది. ఈ సంద‌ర్భంగా బోలెడ‌న్ని విశేషాలు చోటు చేసుకున్నాయి. ఈ వేడుక గురించి మీడియాలో భారీగా క‌వ‌ర్ అయింది. అయితే.. కొన్ని అంశాలు మాత్రం పెద్ద‌గా క‌వ‌ర్ కాలేదు. అలాంటి వాటిని చూస్తే..

బెంగ‌ళూరుకు చెందిన ఓ సంస్థ మిత్ర రోబోను త‌యారు చేయ‌టం.. తొలిరోజు స‌భ‌లో అదో ఆక‌ర్ష‌ణీయంగా మార‌టం తెలిసిందే. ఈ రోబో స్క్రీన్ మీద భార‌త్ - అమెరికా గుర్తుల‌ను ఏర్పాటు చేశారు. దీని స్విచ్‌ ను తొలుత ప్ర‌ధాని మోడీ త‌ర్వాత ఇవాంక నొక్కాల్సి ఉంది. అనుకోని రీతిలో ఈ ఇద్ద‌రూ ఒకేసారి మీట నొక్కారు.

వెంట‌నే.. వెల్ క‌మ్ ప్రైమ్ మినిస్ట‌ర్ అని రోబో అన‌టంతో ఇరువురు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేయ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. నిజానికి మిత్ర రోబో అబ‌ద్ధం చెప్ప‌లేద‌ని చెప్పాలి. ప్ర‌ధాని మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయితే.. అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె ఇవాంక‌.. త‌న తండ్రికి స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ఆమె కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మాట ప‌లువురి నోట బ‌లంగా వినిపిస్తోంది. ఈ కోణంలో చూసిన‌ప్పుడు ఇవాంకాను తెర వెనుక అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించ‌టం స‌బ‌బేమో.

తొలిసారి భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఇవాంక త‌న మాట‌తోనూ.. చేత‌ల‌తోనూ అంద‌రి మ‌న‌సుల్ని దోచుకున్నారు. జీఈఎస్ స‌ద‌స్సులో మాట్లాడిన సంద‌ర్భంగా ఒక ద‌గ్గ‌ర నిలుచొని మాట్లాడే సంప్ర‌దాయ ధోర‌ణికి భిన్నంగా మాట్లాడి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. వేదిక అన్ని వైపులా ఉన్న వారిని క‌లుపుకుంటూ ఆమె చేసిన ప్ర‌సంగం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది.

భార‌త్ గొప్ప‌త‌నం గురించి.. భార‌త్ ప్ర‌ధాని మోడీ గురించి.. కొంద‌రు స్ఫూర్తివంతుల గురించి ప్ర‌స్తావించిన ఆమె మాట‌లు ఉత్సాహ‌భ‌రితంగానూ.. చ‌లాకీగానూ ఉన్నాయ‌ని చెప్పాలి. సాధార‌ణంగా ప్ర‌ముఖుల్లో ఇలాంటి కోణం చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తుంది. చాలా కొద్దిమందిలో మాత్ర‌మే క‌నిపించే అంశాలు ఇవాంకలో ఉండ‌టం ఆమె మీద మ‌రింత గౌర‌వాన్ని.. అభిమానాన్ని పెంచేలా చేసింది.

త‌న ప్ర‌సంగంలో భాగంగా భార‌త్‌కు చెందిన ప‌లువురి ప్ర‌ముఖుల‌ను ఇవాంక ప్ర‌స్తావించిన‌ప్పుడు స‌భికుల నుంచి విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. త‌న మాట‌ల‌కు స‌భికులు క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో సంతోషాన్ని వ్య‌క్తం చేస్తే.. ఇవాంక కూడా తాను చ‌ప్ప‌ట్లు కొట్టి స్ఫూర్తివంతంగా నిలిచారు.

తొలిరోజు స‌ద‌స్సులో ఇవాంక స్ఫూర్తివంత‌మైన ప్ర‌సంగంతో పాటు.. ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగం అంద‌రిని ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా త‌క్కువ సేపు మాట్లాడారు. త‌న ప్ర‌సంగంలో భాగంగా ఇవాంక‌ను ఉద్దేశించి శ్రీ‌మ‌తి ఇవాంక ట్రంప్ అని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. మిగిలిన వారికి భిన్నంగా కేసీఆర్ ఆమెను ప్ర‌స్తావించిన తీరును అంద‌రూ మెచ్చుకుంటున్నారు. త‌న పేరు మొద‌ట్లో వినిపించిన శ్రీ‌మతి అన్న మాట‌కు అర్థాన్ని ఇవాంక త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకొని ఉండొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక‌.. స‌ద‌స్సులో చివ‌రిగా మాట్లాడిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ఊహించ‌ని రీతిలో మాట్లాడి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. స‌ద‌స్సుకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రానికి తాను చిన్న‌మ్మ‌న‌ని చెప్పుకున్నంత‌నే స‌భికుల నుంచి భారీ స్పందన ల‌భించింది.