Begin typing your search above and press return to search.
సూరి హత్య తీర్పు తర్వాత భానుమతి నిర్ణయమిదీ..
By: Tupaki Desk | 20 Dec 2018 11:43 AM ISTటీడీపీ ఫ్యాక్షన్ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మద్దెల చెరువు సూరి హత్య కేసు తీర్పు వచ్చేసింది.. సూరిని చంపిన భాను కిరణ్ కు యావజ్జీవ శిక్ష పడింది. ఈ తీర్పుతో సూరి భార్య గంగుల భానుమతి హర్షం వ్యక్తం చేశారు. సూరిని పరిటాల కుటుంబమే చంపించిందని.. కిరాయి ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
ఫ్యాక్షన్ తో అట్టుడికిన అనంతపురంలో పరిటాల - సూరి హత్యల తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తాజాగా పరిటాల కుటుంబానికి పోటీగా మద్దెల చెరువు సూరి భార్య భానుమతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సూరి అభిమానులు - అనుచరులు ఈమెను రాజకీయాల్లో దించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.
అనంతపురంలో ఇప్పుడు టీడీపీ బలంగా ఉంది. ఆ పార్టీకి పోటీగా వైసీపీ మాత్రమే నిలబడుతోంది. ఈ నేపథ్యంలోనే భానుమతి వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. రాజకీయంగా జగన్ వెంటే నడుస్తామని తాజాగా గంగుల భానుమతి స్పష్టం చేశారు. జగన్ నుంచి మాత్రం వీరి చేరికపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. జగన్ ను కలిసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు..
సూరి హత్య తర్వాత ఆయన భార్య భానుమతి బయటకు రాలేదు. తాజాగా తుది తీర్పు వెల్లడైన తర్వాత ఆమె రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. తన కుమారుడు చదువుకుంటున్నానని.. అతడి భవిష్యత్ కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. కొడుకును రాజకీయాల్లోకి తెచ్చే ప్రస్తక్తేలేదని.. తాను మాత్రమే రాజకీయాల్లో ఉంటానని భానుమతి స్పష్టం చేశారు.