Begin typing your search above and press return to search.

మదనపల్లి జంట హత్యలు..కోట్ల కోసమే కుట్ర జరిగిందా ?

By:  Tupaki Desk   |   4 Feb 2021 7:00 PM IST
మదనపల్లి జంట హత్యలు..కోట్ల కోసమే కుట్ర జరిగిందా ?
X
మదనపల్లిలో జరిగిన జంట హ్యతలు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ హత్యల వెనుక రోజుకో కారణం బయటపడుతోంది. రోజుకో అనుమానం బయటకు వస్తోంది. తాజాగా బయటపడిన అనుమానం ఏమిటంటే రెండు హత్యల వెనుక కోట్ల రూపాయల ఆస్తుల కుట్ర జరిగిందని. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలీదు కానీ స్ధానికుల్లో ఇదే విధమైన అనుమానం పెరిగిపోతోంది.

ఇంత అనుమానం ఎందుకంటే చనిపోయిన పిల్లల తల్లి, దండ్రులకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయట. చెన్నై, బెంగుళూరు, చిత్తూరు, మదనపల్లిలో కంటి కనిపించే ఆస్తులే ఉన్నాయట. ఇక కంటికి కనిపించని ఆస్తులు ఇంకెన్ని ఉన్నాయో ఎవరికీ తెలీదు. మదనపల్లిలోనే మాస్టర్ మైండ్స్ అనే పెద్ద కాలేజీ వీళ్ళదే. ఈ కాలేజీ విలువే కోట్ల రూపాయలుంటుందని అంటున్నారు. అలాటే వీళ్ళు ఉంటున్న సొంతిల్లు కూడా బాగా పెద్దదే కాక ఖరీదైనది కూడా.

కోట్ల రూపాయల ఆస్తులపై కన్నేసిన వాళ్ళే వీళ్ళని ఏదైనా ట్రాన్స్ లోకి పంపేసి ఆస్తులు రాయించేసుకుందామని ప్లాన్ వేశారేమో అనే అనుమానాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. పురుషోత్తమనాయుడు, పద్మజ దంపతుల వ్యవహారం మొన్నటి వరకు ఎవరికీ కనీసం అనుమానం కూడా రాలేదంటేనే వ్యూహం ఎంత పకడ్బందీగా రచించారో తెలిసిపోతోంది. ఈమధ్యనే చిత్తూరులోని పుట్టింటి వాళ్ళ నుండి పద్మజకు సుమారు రూ. 6 కోట్ల విలువైన ఆస్తి కలిసివచ్చిందట. ఇది కాకుండా ఇంకా చాలా ఆస్తులున్నాయట వాళ్ళకు. మొత్తం మీద పల్లల హత్య గనుక వెంటనే బయటపడకపోయుంటే తల్లి, దండ్రులు కూడా హత్యకు గురయ్యేవారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పెద్దవాళ్ళు ట్రాన్స్ లో నుండి మామూలు ప్రపంచంలోకి వస్తేకానీ అసలు విషయాలు బయటపడవు.