Begin typing your search above and press return to search.
కుక్కను చంపి బతికించాను.. చెల్లిని కూడా అలాగే చేస్తానన్న అలేఖ్య!
By: Tupaki Desk | 27 Jan 2021 5:33 PM ISTచిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల వెనకున్న కారణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పూర్తిగా మూఢనమ్మకాల వల్లే ఈ దారుణం జరిగినప్పటికీ.. ఈ హత్యలకు మూలాలు ఏంటన్నది క్రమంగా బయటపడుతున్నయి. ఈ హత్యలకు ముందు మల్లూరు పురుషోత్తం నాయుడు, పద్మజ కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్య ఇన్‌స్టా గ్రామ్‌లో చేసిన పోస్టులను పోలీసులు పరిశీలించిన విషయం తెలిసిందే.
ఇన్ స్టాలో ''వర్క్ ఈజ్ డన్.. శివ ఈజ్ కమింగ్'' అంటూ పోస్ట్ చేసింది పెద్ద కూతురు లేఖ్య. ఇంకా.. మిగిలిన పోస్టులను కూడా పరిశీలించగా.. పునర్జన్మలపై వారికి ఉన్న విశ్వాసమే ఈ దారుణ హత్యలకు కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. వారి పెంపుడు కుక్కపై పెద్ద కూతురు అలేఖ్య పునర్జన్మ ప్రయోగాలు చేసినట్లుగా చెబుతున్నారు పోలీసులు. ఈ ప్రయోగమే చెల్లెలిపై కూడా చేసినట్టు సమాచారం.
ఈ ప్రయోగంలో భాగంగా.. తాను పెంపుడు కుక్కను చంపి, మళ్లీ బతికించినట్లుగా అలేఖ్య తల్లిదండ్రులను నమ్మించిందట. మరి, ఆమె ఎలా చేసిందో.. వీరు ఎలా నమ్మారో తెలియదుగానీ.. మొత్తానికి అలేఖ్య మాటలు విశ్వసించారు తల్లిదండ్రులు. దీంతో.. ఇదే ప్రయోగం చెల్లెలు సాయి దివ్యపై చేస్తానని చెప్పిందట అలేఖ్య. ఇందులో భాగంగానే.. మంత్రాలు చదివి.. పూజలు చేసి.. అందరూ కలిసి చిన్న అమ్మాయిని చంపేశారని సమాచారం.
ఆ తర్వాత తనను కూడా అదేవిధంగా చంపేయాలని అలేఖ్య చెప్పడంతో తల్లి దారుణంగా చంపేసిందట. చనిపోయిన చెల్లి ఆత్మను తిరిగి తెస్తానని.. అందుకోసం తన ప్రాణం తీయాలని చెప్పిందట అలేఖ్య. దీంతో.. ఆ మైకంలో ఉన్న తల్లి పద్మజ.. నవధాన్యాలు పోసిన కలశాన్ని ఆలేఖ్య నోట్లో పెట్టి.. కిరాతకంగా హతమార్చినట్టుగా చెబుతున్నారు. ఆ సమయంలో భర్త కూడా వారితోనే ఉన్నట్టు పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికి పునర్జన్మ నమ్మకమే ఈ దారుణానికి కారణమైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.