Begin typing your search above and press return to search.

మదనపల్లి జంట హత్యల కేసు : విశాఖ మెంటల్ ఆస్పత్రికి దంపతులు పద్మజ - పురుషోత్తం

By:  Tupaki Desk   |   3 Feb 2021 6:29 PM IST
మదనపల్లి జంట హత్యల కేసు : విశాఖ మెంటల్ ఆస్పత్రికి దంపతులు పద్మజ - పురుషోత్తం
X
చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన కూతుళ్లు చనిపోలేదని ఇంకా బతికే ఉన్నారని మృతుల తల్లిదండ్రులు చెప్పడం విశేషం. మూఢ విశ్వాసం, మానసిక రుగ్మతలతో ఇద్దరు కూతుళ్లను కన్న తల్లిదండ్రులే కడతేర్చారు. జంట హత్యల కేసులో అరెస్టైన పురుషోత్తంనాయుడు, పద్మజలను మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. నిందితులిద్దరి మానసిక పరిస్థితిపై తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు సరైన నిర్ణయానికి రాలేకపోవడం, వారికి వచ్చిన మానసిక సమస్య ఏంటనేది స్పష్టంగా లేకపోవడంతో విశాఖలోని ఆస్పత్రికి తరలించారు.

వాస్తవానికి నాలుగురోజుల క్రితమే పద్మజ, పురుషోత్తంనాయుడుని విశాఖ తరలించాల్సి ఉన్నప్పటికీ , ఎస్కార్ట్ వాహన విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ వాహనానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవడంతో ఈ ఉదయం మదనపల్లి సబ్ జైలు నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. జంట హత్యల అనంతరం అరెస్టైన పురుషోత్తంనాయుడు, పద్మజలను పోలీసులు మదనపల్లెలోని సబ్ జైలుకు తీసుకెళ్లారు.

అయితే, అక్కడ పద్మజ తన వింత ప్రవర్తలనో సాటి ఖైదీలకు పిచ్చెక్కింటింది. తాను శివుడ్నని, కాళికా దేవినంటూ తన చుట్టూ తానే తిరుగుతూ కిందపడిపోవడం, అర్ధరాత్రి పూట కేకలు వేస్తూ ఖైదీలను భయభ్రాంతులకు గురిచేసింది. ఆమెను వేరే బ్యారక్ లో ఉంచడానికి పోలీసులు యత్నించినా.. అందరితో కలిసుంటానిని వాదించడం, తీరా మహిళా ఖైదీల బ్యారక్ లో ఉంటితే కేకలు వేయడం ఇలా పది రోజుల నుంచి జైలు అధికారులకు చుక్కలు చూపించింది పద్మజ. అయితే, పురుషోత్తంనాయుడు మాత్రం సాధారణంగానే ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఘటనలతో పాల్పడటంతో వారిని వైద్యపరీక్షల నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అడిగిన ప్రశ్నలకు కూడా చిత్ర, విచిత్రమైన సమాధానాలు చెప్పిన భార్యాభర్తలు ఇరువురూ మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని, వారిరువురిని జైలు వంటి గదిలో ఉంచి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని, అందరితో కలిసి ఉంచితే ప్రమాదమని, విశాఖపట్నం లోని మానసిక చికిత్స ఆలయానికి రిఫర్ చేస్తున్నామని రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీనితో వారిని ఈ రోజు విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అక్కడ వీరిద్దరికీ వైద్యులు చికిత్స అందించనున్నారు.