Begin typing your search above and press return to search.
ట్రంప్ మైనపుబొమ్మ తొలగింపు.. హతవిధి ఇక పతనం తప్పదా?
By: Tupaki Desk | 31 Oct 2020 9:00 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తీవ్రమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆయనకు ఓటమి తప్పదని ప్రీ పోల్స్ కోడై కూస్తున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఈ సారి కూడా ప్రీపోల్స్, సర్వే రిపోర్టులు అంచనాలు తప్పు కావాలని ట్రంప్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ట్రంప్ వైట్‌హౌస్‌ను విడిచిపెట్టే రోజు దగ్గర్లోనే ఉందని సమాచారం. అమెరికాలో నవంబర్ 3న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఓటరు ఎలా స్పందిస్తాడో అని యావత్ ప్రపంచం వేచిచూస్తున్నది.
ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. బెర్లిన్‌లోని మైనపు బొమ్మల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ లో ప్రముఖుల మైనపు బొమ్మలు కొలువుదీరుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యూజియం నుంచి తాజాగా ట్రంప్ విగ్రహాన్ని తొలగించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ట్రంప్ చిరకాల ప్రత్యర్థి ఒరాక్ ఒబామా మైనపు విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచారు. దీంతో అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇది ట్రంప్‌కు అవమానం లాంటిదే అన్న వాదన వినిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇదో ప్రతీకాత్మక పరిణామమని మేడమ్ టుస్సాడ్స్ మార్కెటింగ్ మేనేజర్ ఓక్రిడ్జి యాల్సిడాంగ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ట్రంప్ ఓటమి తప్పదని తెలిసి విగ్రహాన్ని తొలగించారేమో నన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఒబామాకు అత్యంత సన్నిహితురాలు కావడంతో... ఈ పరిణామం వెనుక ఏంజెలా హస్తం ఉందా.. అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇప్పటివరకూ వెల్లడైన నేషనల్ పోల్స్ ప్రకారం బైడెన్ ముందంజలో ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో ఆయన ట్రంప్ కంటే ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రజలు ముందస్తు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.