Begin typing your search above and press return to search.

పిచ్చ పీక్స్.. యూట్యూబ్ లో ఫేమస్ కావటం కోసం దాన్ని కోయించుకున్న టీచర్

By:  Tupaki Desk   |   3 March 2021 9:30 AM GMT
పిచ్చ పీక్స్.. యూట్యూబ్ లో ఫేమస్ కావటం కోసం దాన్ని కోయించుకున్న టీచర్
X
పిచ్చ పీక్స్ కు వెళుతోంది. ఏదో ఒకటి చేయాలి.. పాపులర్ అయిపోవాలి. వైరల్ వీడియోలు తయారు చేయాలన్న ఆత్రుత.. దాని స్థాయిని దాటేసి వెర్రిగా.. అంతకు మించిన పిచ్చిగా మారిన తీరు చూస్తే.. నోట మాట రాని పరిస్థితి. తాజాగా వెలుగు చూసిన ఉదంతాన్ని చూస్తే.. నోట మాట రాదు. ఎంత యూట్యూబ్ లోసంచలన వీడియోను పోస్టు చేయాలంటే మాత్రం.. మరీ ఇంత దారుణమైన ఐడియా వేయాలా? అన్న భావన కలుగక మానదు. ఇప్పుడు చెప్పే దరిద్రమంతా చేసింది ఒక టీచర్ కావటం షాకింగ్ అయితే.. తన రూమ్మేట్ ను ఒప్పించి అడ్డంగా బుక్ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

ఆండ్రూ బ్రీచ్ అనే టీచర్ ఉన్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పి.. వారికి మంచి విద్యాబుద్ధులతో వారి భవిష్యత్తును బంగారుగా మార్చాల్సిన బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ఈ బ్రిటన్ వ్యక్తికి ఒక పిచ్చ ఉంది. యూట్యూబ్ లో పాపులర్ కావాలని.. తాను చేసే వీడియోతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన చాలా ఎక్కువ. అందుకోసం తెగ ఆలోచించిన అతడు.. చివరకు చావుతెలివికి పోయి దరిద్రపుగొట్టు ఐడియా ఒకటి వేశారు.

తన రూమ్మేట్ అయిన ఆరోన్ (స్పెయిన్ కుర్రాడు)కు ఒక సవాలు విసిరాడు. తన ప్రైవేట్ పార్టును కోసి మగతనం లేకుండా చేస్తే.. అతడికి 173 పౌండ్లు ఇస్తానని ఆశ చూపించాడు. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.18వేలు మాత్రమే. అంతేకాదు.. ఆ దరిద్రాన్ని వీడియోగా చేసి యూట్యూబ్ లో వదిలితే.. దానికి వచ్చే షేరింగులు.. వ్యూస్ ఆధారంగా ఇచ్చే రెవెన్యూలో కొంత భాగాన్ని ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు.

12 ఇంచుల పదునైన కత్తిని సిద్ధం చేసిన అతడు.. తన రూమ్మేట్ కు ఇచ్చి పురుషాంగాన్ని కోసేస్తూ వీడియో తీశాడు. ఊహకు.. వాస్తవానికి మధ్యనున్న వ్యత్యాసం ఇట్టే అర్థం కావటమే కాదు.. భయంకరమైన నొప్పితో విలవిలలాడటం.. తీవ్రమైన రక్తస్రావం కావటంతో హాస్పిటల్ కు హుటాహుటిన తరలించారు. ఈ పని చేసిన టీచర్ రూమ్మేట్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ పాడు పని చేసినందుకు నాలుగున్నరేళ్ల జైలుశిక్ష పడుతుందని చెబుతున్నారు.

తమ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే తన ప్రైవేటు పార్టును కోసినట్లు చెప్పిన వారు.. కోర్టులో మాత్రం మాట మార్చారు. తానే స్వయంగా కోసుకున్నట్లు చెప్పాడు. దీనిపై కోర్టు తుది తీర్పు వెలువరించలేదు. కాకుంటే.. ప్రైవేటు పార్టును కోయించుకున్నా.. వైద్యుల పుణ్యమా అని అతని మగతనం నిలిచే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ చేసి.. కోసిన పార్టును విజయవంతంగా అతికించేశారు.