Begin typing your search above and press return to search.

నడి రోడ్డుపై కన్నీళ్లు పెట్టుకున్న లగ్జరీ అమ్మాయిలు ..కారణం ఇదే !

By:  Tupaki Desk   |   19 May 2020 7:00 AM IST
నడి రోడ్డుపై కన్నీళ్లు పెట్టుకున్న  లగ్జరీ అమ్మాయిలు ..కారణం ఇదే !
X
ఈ మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తిలేదు. మహమ్మారి కారణంగా జనజీవనం పూర్తిగా స్థంబించిపోవడం , అలాగే వాహన రాకపోకలపై పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేస్తుండటంతో ప్రజలందరూ కూడా నానాఅవస్థలు పడుతున్నారు. గత రెండు నెలన్నర క్రితం వరకు కొంతమంది యువతులు స్టార్‌ హోటళ్లు, మాల్స్ ‌లలోని స్పా, మసాజ్‌, బ్యూటీ సెంటర్లలలో పనిచేసిన వాళ్లు. ఇప్పుడు ఈ లాక్ ‌డౌన్‌ రూపంలో వారికి కన్నీళ్లు తప్పట్లేదు. సెలూన్లు, స్పాలు, బ్యూటీ పార్లర్లకు అనుమతి ఇప్పట్లో అనుమానమే కావడంతో ఎంతో మంది యువతులు రోడ్డున పడాల్సిన పరిస్థితి.

పూర్తి వివరాలు చూస్తే .. చెన్నై, శాంతి కాలనీ పరిసరాల్లో వాణిజ్య సముదాయాలు అధికంగా ఉండగా, ఇక్కడే చాలా కంపెనీల ఆఫీసులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని పలు కంపెనీలు తమ సిబ్బంది ద్వారా స్టార్ హోటల్స్, మాల్స్ లో ఉద్యోగులను సమకూరుస్తుండగా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది పని చేస్తున్నారు. లాక్ డౌన్ తరువాత వీరికి పని పోయింది. జీతం చేతికందే పరిస్థితి లేదు. దీంతో వీరంతా దాదాపు రెండు నెలలు, తమ వద్ద ఉన్న డబ్బుతోనే నెట్టుకొని వచ్చారు. ఇక ఇప్పట్లో సెలూన్లు, బ్యూటీ స్పాలకు అనుమతి ఇచ్చేది లేదని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక చేసేదేమీ లేక, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని, తమ స్వరాష్ట్రానికి వెళ్లాలని వీరంతా నిశ్చయించుకున్నారు. దరఖాస్తు చేసి, అనుమతులు పొందారు. ఇక వీరంతా అసోం భవనానికి చేరుకుంటే, అక్కడి అధికారులు స్వరాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తారు.

అప్పుడే వీరికి కష్టాలు మొదలయ్యాయి.అసోం భవన్ కు వెళ్లేందుకు చార్జీగా తమ వద్ద ఉన్న డబ్బంతా ఇవ్వాల్సిన పరిస్థితి వీరికి ఎదురైంది. వీరి చేతిలో పాస్ ఉండటంతో, వీరిని అసోం భవనానికి చేరుస్తామంటూ, కొందరు ఆటో డ్రైవర్లు సిద్ధమయ్యారు. అందుకు ప్రతిగా వేలల్లో అడిగారు. పోలీసులు పట్టుకుంటే తాము ఇరుక్కుంటామని సాకులు చెబుతూ, యువతులు కన్నీరు పెట్టుకున్నా ఆటో డ్రైవర్లు కరుణించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అందరూ విషణ్ణ వదనాలతో రోడ్డు పై ఉండగా, ఆ వైపు వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ కుమరేషన్ చూశాడు. వారిని అడిగి విషయం తెలుసుకుని, వెంటనే చెన్నై ప్రెస్ క్లబ్ కు సమాచారాన్ని ఇచ్చాడు. వారు పోలీసులకు విషయాన్ని చేర్చగా, పోలీసులు, అధికారులు స్పందించారు.

ఆ విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు 20 మందికి పైగా ఉన్న యువతుల్ని , అలాగే, నాగాలండ్‌కు చెందిన పది మంది మేరకు యువకుల్ని సైతం ఆటోల్లో ఎక్కించి, భద్రత నడుమ మేడవాక్కం క్యాంప్‌ రోడ్డు లో ఉన్న అసోం భవన్‌ కు పంపించారు. అక్కడి నుంచి అధికారులు వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. యువతుల కన్నీటి కష్టాలను తెర పైకి తెచ్చి, వారి సమస్యను పరిష్కరించిన ఫోటో జర్నలిస్ట్ కుమరేషన్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.