Begin typing your search above and press return to search.
మరో షాక్.. కరోనా రోగులకు ఊపిరితిత్తులు, గుండె జబ్బులు!
By: Tupaki Desk | 12 Sept 2020 6:00 AM ISTకరోనా కేసుల నమోదు ముని పటితో పోలిస్తే మన దేశంలో వేగం పెరిగింది. రోజుకు వేలాది కేసు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్యా పరంగా మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానం లో ఉంది. ఈ వ్యాధి గురించి, ఈ వ్యాధి తీవ్రత గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేక పోవడంతో.. దీని గురించి రోజుకో కొత్త విషయం చెబుతున్నారు. వ్యాధి బారిన పడితే తలెత్తే పర్యవసానాల గురించి వివరిస్తున్నారు. కరోనా సోకిన వారు రెండు వారాల నుంచి 20 రోజుల్లోగా కోలుకుంటున్నారు. కాగా తాజా గా జరిగిన ఓ అధ్యయనం లో. కరోనా సోకిన వారికి ఊపిరి తిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలడం తో అంతా ఆందోళన చెందుతున్నారు.
యూరోపియన్ రెస్పిటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సైంటిస్టులు తాజాగా కరోనా నుంచి కోలుకున్న 86 మందిపై అధ్యయనం నిర్వహించారు. కరోనా బారిన పడితే ఊపిరితిత్తులు గుండెకు సంబంధించి తీవ్ర నష్టం జరుగుతుందని అయితే క్రమేణా పరిస్థితి సాధారణ పరిస్థితి కి చేరుకుంటుందని ఆ అధ్యయనంలో వైద్య నిపుణులు తేల్చారు. కరోనా నుంచి కోలుకున్న 86మంది పై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆరో వారంలో వారికి సిటీ స్కాన్ చేయగా వారిలో ఊపిరితిత్తుల కెపాసిటీ 88 శాతం వరకు క్షీణించగా, 12వ వారంలో అది 56 శాతానికి తగ్గిందని తేలింది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తినట్లు గుర్తించారు. సాధారణ ఆరోగ్య వంతులకు కరోనా సోకితే ఊపిరి తిత్తులు గుండె కు సంబంధించిన సమస్యలు తలెత్తుతుండగా ఇక ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి కరోనా వస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు వ్యాధులతో ఇదివరకే ఇబ్బందులు పడుతున్న వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. యూరోపియన్ రెస్పిటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సైంటిస్టులు తమ అధ్యయనం కోసం సగంమంది పొగ తాగే వాళ్ళు, స్థూలకాయులను ఎంపిక చేసుకున్నారు