Begin typing your search above and press return to search.

మమ్మల్ని ఓడిస్తారు.. మోడీ వాతపెట్టాడుగా..?

By:  Tupaki Desk   |   14 Feb 2020 3:00 AM IST
మమ్మల్ని ఓడిస్తారు.. మోడీ వాతపెట్టాడుగా..?
X
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించినందుకు ప్రధాని మోడీ ప్రజలకు గట్టి షాకే ఇచ్చారు. తమను ఓడిస్తారా అని కర్రు కాచి వాత పెట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందర మోడీసార్ కనుక గ్యాస్ సిలిండర్ల ధర పెంచి ఉంటే ఆ ఏడో ఎనిమిదో సీట్లు కూడా వచ్చేవి కావు.. జనాలు గెలిపిస్తే గ్యాస్ ధర పెంచేవాడు కాదేమో.. ఇప్పుడు ఓడించారు కదా అందుకే వారి నెత్తిన గ్యాస్ బండ వేశారు.

తేనే పూసిన కత్తివలే మోడీసార్ పెంచిన గ్యాస్ ధరలకు ఇప్పుడు జనాలంతా అతాషులయ్యారు. ఒకటా రెండా రాయితీ సబ్సిడీ సిలిండర్ గ్యాస్ ధరను ఏకంగా 148 రూపాయలకు పెంచేశాడు. అడిగేవాడు లేడు.. ప్రశ్నించే ప్రతిపక్షం లేదు.. రోడ్ల మీదకొచ్చి నిరసన తెలిపే టైం ఎవ్వరికీ లేదు.. అసలు ఆందోళనలే చేస్తాలేరు జనాలు. అందుకే మోడీసార్ విచ్చలవిడిగా అందినంత పెంచేశారు.

సబ్సిడీ గ్యాస్ ధరను రూ.148 రూపాయలు పెంచితే అంతే పెరిగిన మొత్తాన్ని సబ్సిడీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేస్తాడు కదా మీకేం నొప్పి అని బీజేపీ వోళ్లు బట్టలు చింపుకుంటున్నారు. కానీ ఇక్కడే తిరకాసు ఉంది. ప్రధాని మోడీ గద్దెనెక్కగానే.. కాస్త ఉన్నవాళ్లంతా ప్రభుత్వ సబ్సిడీ వదులుకోమని చెప్పగానే మోడీ పిలుపుతో.. ఆయన దేశభక్తికి ఫిదా అయిపోయి దేశంలో కోట్లాది మంది సబ్సిడీ వదులుకున్నారు. కొన్ని ఏళ్లుగా గ్యాస్ సిలిండర్ కు ఎంత రేటు ఉందో అంతే రేటుకు కొంటున్నారు.

ఇప్పుడు 148 రూపాయలు పెంచిన మోడీ సబ్సిడీ ఉన్నోళ్లకు ఆ మొత్తం బ్యాంకులో వేస్తాడు.. సబ్సిడీ లేనోళ్ల గతి అథోగతే అవుతోంది. ఇలా మోడీ సార్ ను నమ్మి గ్యాస్ రాయితీ వదులుకున్న సామాన్యులు, ఉద్యోగులు, బీజేపీ కార్యకర్తలు, నేతలు సైతం ఇప్పుడు కుయ్యో ముర్రో అంటున్నారట.. ఏం చేస్తాం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అంటే ఇదే మరీ.. అనుభవించండీ..!