Begin typing your search above and press return to search.
కరోనా కారణంగా చమురు ధరలు మైనస్ లోకి
By: Tupaki Desk | 21 April 2020 10:10 AM ISTచాలా అరుదైన ఘటనలు కరోనా కారణంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచం ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాల్ని చూసినా.. అప్పుడు కూడా చూడని సిత్రమైన పరిస్థితులు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయే దుస్థితి నెలకొంది. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసిందే. కరోనా కారణంగా అన్ని రంగాలు ప్రభావితమైన వేళ.. ప్రపంచ చమురు ధరల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
కరోనాను కంట్రోల్ చేసే పనిలో భాగంగా దేశాలకు దేశాలు లాక్ డౌన్ విధించేయటం.. ఎవరిళ్లల్లో వారు ఉండిపోవటంతో చమురు వాడకం భారీగా తగ్గిపోయింది. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు నిల్వలు పెద్ద ఎత్తున పేరుకొని పోయాయి. చమురు కంపెనీలు కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా వ్యవస్థలన్ని ఆగిపోవటంతో చమురు వాడకం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో.. ధరల మీద దీని ప్రభావం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. జూన్ లో ఫ్యూచర్స్ కు సంబంధించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడూ లేనట్లుగా మైనస్ లోకి వెళ్లిపోవటం గమనార్హం.
ముడి చమురు వినియోగం తగ్గిపోవటంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. డిమాండ్ భారీగా పడిపోవటం.. ఉత్పత్తి ఎంత తగ్గించినా.. వినియోగం లేకపోవటంతో చమురు రంగం కుదేలయ్యే పరిస్థితి. రానున్న రోజుల్లోనూ ముడి చమురు వినియోగం అంత డిమాండ్ ఉండదన్న మాట వినిపిస్తోంది. కరోనా బారిన పడ్డ ప్రపంచం.. దాని నుంచి కోలుకొన్న తర్వాత కానీ ముడి చమురు వినియోగం షురూ కాదు. ఈ కారణంతోనే కనిష్ఠ స్థాయికి పడిపోయిన ముడిచమురు ధర.. ఇప్పుడు మైనస్ లోకి వెళ్లిపోయింది. అంటే.. ఉచితంగా ఇచ్చే వరకూ వెళ్లిందా? అంటే లేదనే చెప్పాలి.
ముడిచమురు ధర మైనస్ లోకి పడిపోవటం కారణంగా దాన్ని ఉచితంగా ఇచ్చేస్తారా? అన్న సందేహం కలిగితే తప్పులో కాలేసినట్లే. నిజానికి ఈ తగ్గుదల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. తాజాగా నెలకొన్న పరిస్థితిని చూస్తే.. ప్రస్తుతం బ్రెంట్ ఆయిల్ క్రూడ్ ధర మైనస్ 26.24 డాలర్లకు పడిపోయింది. సోమవారం అర్థరాత్రి సమయానికి ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. లెక్కగా చూస్తే.. ఒక బ్యారల్ ముడి చమురు తీసుకుంటే.. వారు ఎదురు 26.24 డాలర్లు ఇవ్వాలన్నట్లుగా కనిపిస్తుంది.
వాస్తవం మరోలా ఉంటుంది. పేపర్ మీద కనిపించే మైనస్ అంకెలు.. ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఉండవు. ఈ మైనస్ లెక్కలు.. పడిపోయిన డిమాండ్ కు.. పేరుకు పోయిన నిల్వల నేపథ్యంలోనే అన్నది మర్చిపోకూడదు. ఇంత జరుగుతున్నా దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసు కదా? ఇవాల్టి రోజున ప్రభుత్వాలు బతికేదే.. మద్యం.. పెట్రోల్.. డీజిల్ అమ్మకాల మీద వచ్చే పన్నుల మీదనే. అలాంటి వేళలో.. ధర ఎంత మైనస్ లోకి వెళ్లినా.. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పక తప్పదు.