Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం లవ్ స్టోరీ ఇది

By:  Tupaki Desk   |   13 Aug 2022 4:32 AM GMT
ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం లవ్ స్టోరీ ఇది
X
బిహార్ రాజకీయాల్లో అనూహ్యంగా చోటు చేసుకున్ పరిణామాలతో ఓడలు బండ్లు..బండ్లు ఓడలు కావటం తెలిసిందే. సాధారణంగా రాజకీయ సంచలనం చోటు చేసుకున్నప్పుడు అది కొద్ది రోజుల పాటు సాగుతుంటుంది. అందుకు భిన్నంగా రోజు వ్యవధిలోనే (24 గంటల వ్యవధిలోనే) మొత్తం వ్యవహారం పూర్తి కావటం.. అధికార బదిలీ సింఫుల్ గా జరిగిపోవటం అందరిని ఆశ్చర్యపరిచింది. తమ చేతుల్లో ఉన్న అధికారం చేజారిపోతే మోడీషాలు ఎంత మండిపాటుకు గురి అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. బిహార్ విషయంలో చేష్టలుడిగినట్లుగా ఉండిపోయారే తప్పించి.. జరుగుతున్న పరిణామాన్ని నిలువరించే ప్రయత్నాలు జరగకపోవటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బిహార్ కు మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు.. ఆయనకు అసలుసిసలు రాజకీయ వారసుడిగా అభివర్ణించే తేజస్వీ యాదవ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆయన గత ఏడాది డిసెంబరులో జరిగిన పెళ్లి తర్వాత నుంచి లాలూ ఇంట అద్రష్టం నడిచివచ్చినట్లుగా చెప్పటం ఒక ఎత్తు.. దాన్ని బిహార్ ప్రజలు సైతం పెద్ద ఎత్తున నమ్మకం మరో ఎత్తుగా చెప్పాలి.

ఇంతకీ తేజస్వీ యాదవ్ లవ్ స్టోరీ ఏంటి? అన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చేకథ విన్నప్పుడు రీల్ స్టోరీకి కాస్త దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంటుంది.అంతేకాదు.. అతగాడి కోసం క్రిస్టియన్ అయిన రాచెల్ గొడిన్షో పెళ్లి వేళకు రాజశ్రీగా మారిపోవటం కనిపిస్తుంది. తేజస్వీ కోసం మతం మార్చుకున్న వైనం చూస్తే.. తేజస్వీని రాజశ్రీ ఎంతలా ప్రేమించిందో.. అతగాడి ప్రేమ కోసం తన మతాన్ని సైతం వదులుకోవటం విశేషంగా చెప్పాలి.

ఇక..తమది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ గా చెబుతారు తేజస్వీ. తన ప్రేమ గురించిన వివరాలు ఆయన చెప్పుకొచ్చారు. తన సతీమణిది హర్యానాలోని రేవారి జిల్లాకు చెందిన అమ్మాయిగా చెప్పారు. ఆమె.. తను ఢిల్లీపబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో ఇద్దరం క్లాస్ మేట్స్ అని.. ఇద్దరి మధ్య ఏడేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిచినట్లు చెప్పుకొచ్చారు.

తన తండ్రి లాలూకు ఈ అమ్మాయి(రేచల్)ను డేటింగ్ చేస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు.. రాచెల్ క్రిస్టియన్ అని మా నాన్నకుచెబితే.. ఆయన ఓకే.. నో ప్రాబ్లమ్ అంటూ రియాక్టు అయ్యారని చెప్పుకొచ్చారు. తమ పెళ్లికి ఆమోదం చెప్పారన్నారు.

లాలూ -రబ్రీ దేవి దంపతులకు తొమ్మిది మంది సంతానం కాగా.. వారిలో తేజ్ ప్రతాప్.. తేజస్వీ యాదవ్ ఇద్దరు అబ్బాయిలుకాగా.. మిగిలిన ఏడుగురు అమ్మాయిలు. అందరిలోకి చిన్నవాడు తేజస్వీ యాదవ్. ఇతను రాజకీయాల్లోకి రావటానికి ముందు క్రికెట్ ఆడేవాడు. తాను ప్రేమించిన రాచల్ పెళ్లి తర్వాత హిందూమతంలోకి మారినట్లుగా తేజస్వీ చెబుతారు. మొత్తానికి రాజకీయంలోనే కాదు..వ్యక్తిగత జీవితంలోనూ తాను అనుకున్నది సాధించే విషయంలో తేజస్వీ యాదవ్ ముందున్నారనే చెప్పాలి.