Begin typing your search above and press return to search.

రూ. 26 కోట్ల దున్నపోతు ..రోజుకో 'జానీ వాకర్' ఫుల్ బాటిల్ లేపేస్తుందట!

By:  Tupaki Desk   |   12 Nov 2020 7:40 PM IST
రూ. 26 కోట్ల దున్నపోతు ..రోజుకో జానీ వాకర్ ఫుల్ బాటిల్ లేపేస్తుందట!
X
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలకు హైదరాబాద్ మహానగరం సుందరంగా ముస్తాబు అవుతుంది. ఈ సదర్ వేడుకల్లో అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకల్లో మేలు రకం జాతి దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నెల 15న జరిగే ఈ ఉత్సవాల్లో హైదరాబాద్ నగరానికి చెందిన ‘లవ్ రానా’ అనే దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు చెప్తున్నారు.

హైదరాబాద్ ఖైరతాబాద్ కు చెందిన మధు యాదవ్ ఏడాది కింద హర్యానా నుంచి దానిని కొనుగోలు చేసి తన డైరీ ఫామ్ లో పోషిస్తున్నారు. ఇది నేషనల్ ఛాంపియన్ లో గెలిచిన సుల్తాన్ రాజు దున్నకు పుట్టిన రానా దూడ అని చెప్పారు. ఖైరతాబాద్ , నారాయణగూడలలో జరిగే సదర్ వేడుకల్లో లవ్ రానా దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ దున్నకి ప్రతిరోజూ ఉదయం10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల పాలతో పాటు డ్రై ఫ్రూట్స్ , ఆపిల్స్ పెడుతున్నామని, రోజుకు రూ.10 వేల ఖర్చు అవుతోందని ఆయన వివరించారు.

దీనితో పాటుగా రూ. 3 వేలు విలువ చేసే జానీ వాకర్ ఫుల్ బాటిల్ మందు రోజుకు ఒకటి తాగుతుందని తెలిపారు. మేలురకం జాతికి చెందిన ఈ దున్నను సదర్ ఉత్సవాలతో పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం పోషిస్తున్నట్లు వారు వివరించారు. ప్రస్తుతం దీని ధర రూ. 26 కోట్లు పలుకుతుందని , అయినా తాము అమ్మడం లేదన్నారు. దీనిని ఒక దున్నపోతులాగ కాకుండ కన్న బిడ్డ లాగా పెంచుకుంటున్నట్లు మధు యాదవ్ స్పష్టం చేసారు.