Begin typing your search above and press return to search.

ప్రేమికులకు, కొత్త జంటల ఏకాంతం కోసం 'లవ్ హోటల్స్'

By:  Tupaki Desk   |   15 Dec 2021 1:56 AM GMT
ప్రేమికులకు, కొత్త జంటల ఏకాంతం కోసం లవ్ హోటల్స్
X
లవ్ హోటల్స్.. పేరు వింటేనే మనసులో ప్రేమ భావన ఉప్పొంగుతోంది కదా.. కానీ ఇవి ఏర్పాటు అవుతున్నాయి. ప్రేమికుల ఏకాంతం కోసం కొత్తగా పుట్టుకొచ్చాయి. యువతరం వ్యక్తిగత జీవితం, ప్రైవసీ కోసం ఇలా కొత్తదారులు వెతుక్కుంటోంది.

ఇప్పుడు ఈ ‘లవ్ హోటల్స్’ మన దేశంలోనూ పాపులారిటీ పెరిగిపోతోంది. యంగ్ స్టర్స్ కోసం ఏర్పాటు చేసిన ఈ హోటల్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ హోటల్స్ దేశ సంస్కృతిని నాశనం చేస్తాయని కొంతమంది అంటుంటే ఇంకొంతమంది యువత స్వేచ్ఛగా ఉండడానికే ఈ హోటల్స్ అవకాశం ఇస్తాయని అంటున్నారు. అయితే అసలేంటి ఈ హోటల్స్,? ఈ హోటల్స్ లో ఏం జరుగుతుందనేదానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏకాంతానికి ఏకైక మార్గంగా ఏర్పడ్డవే ‘లవ్ హోటల్’. జపాన్ లో బాగా ప్రసిద్ధి చెందిన ఈ లవ్ హోటళ్లు 1960ల నుంచి హాంకాంగ్ లోనూ బాగా నడుస్తున్నాయి. గంటకు ఇంత డబ్బు చెల్లించి ఈ హోటల్ రూమ్ లను బుక్ చేసుకోవచ్చు. హాంకాంగ్ లో ఇలాంటి లవ్ హోటళ్లు సుమారు 300 వరకు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో ఒకటైన హాంకాంగ్ లో ఈ హోటళ్లు ఉన్నంతలో తక్కువ ఖర్చుతో ఏకాంతానికి అవకాశం కలిపిస్తున్నాయి.

యువతీ యువకులకు ఇంటిదగ్గర ఏకాంతానికి సరైన సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పెళ్లయిన జంటలు కూడా ఏకాంతం కోసం వారాంతాల్లో లవ్ హోటల్స్ కు వస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువమంది ఉండటం.. ఇల్లు చిన్నదిగా ఉండడం వల్ల వారు ఏకాంతంగా గడపడానికి ఈ దారిని ఎంచుకుంటున్నారు.

మామూలు హోటల్స్ ఉన్నప్పటికీ యువతీ యువకులకు ప్రైవేట్ గా కబుర్లు చెప్పుకోవడానికి ఈ హోటళ్లు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఏకాంతానికి చోటే దొరకడం లేదని యువతీ యువకులు వాపోతున్నారు. సామాన్యులు భరించగలిగే గృహ వసతి కల్పించే 309 ప్రపంచ మెట్రో నగరాల్లో హాంకాంగ్ చివర్లో ఉంది. హాంకాంగ్ లో 70శాతం శృంగారానికి అనుకూలంగా ఉండవని సెక్స్ ఎడ్యూకేషన్ పై పనిచేసే స్టికీ రైస్ అనే ఎన్జీవో 2018లో జరిపినఓ సర్వేలో తేలింది. అందుకే కొందరు దంపతులు నెలకు ఐదుసార్లు వరకూ ఈ లవ్ హోటల్స్ కు వెళుతుంటారని ఆ సర్వే పేర్కొంది.

ఇప్పుడు భారత్ లోనూ కరోనా వచ్చాక ప్రేమికులకు, జంటలకు ప్రైవసీ లేక ఇంట్లోనే లాక్ డౌన్ తో ఉంటుండడంతో వారంతా ఏకాంతం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ లవ్ హోటల్స్ డిమాండ్ భారత్ లోనూ ఊపందుకుంది. ప్రపంచాన్ని మహమ్మారి మళ్లీ ఊపేస్తున్న ఈ సమయంలో యువతీ యువకులు ఈ లవ్ హోటళ్ల కోసం ఎగబడుతున్నారంటే వారు ఎంతగా తపించి పోతున్నారో అర్థం చేసుకోవచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చవుతున్నా చిన్నిచిన్ని ఆనందాల కోసం వారు ఎంతైనా ఫరవాలేదు అన్నట్లుగా వ్యవహరించడం చూడొచ్చు.