Begin typing your search above and press return to search.
పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య !
By: Tupaki Desk | 11 Dec 2020 11:30 AM ISTప్రేమ .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించే పేరు. యువత ఈ ప్రేమలో మునిగిపోతున్నారు. ఈ ప్రేమలో మునిగి ,అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. కొందరు ప్రేమ పేరు చెప్పి అవసరాలు తీర్చుకుంటుంటే , మరికొందరు తమ ప్రేమకి ఇంట్లో వారు అడ్డుపడుతుండటం తో , కలిసి బ్రతకలేక , విడిచి ఉండలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇంట్లో తమ పెళ్ళికి ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా కలిసి జీవనాన్ని కొనసాగించాలనుకున్నారు. అయితే, పెద్దలు అందుకు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించలేక, విడిపోయి బతకలేక తనువు చాలించారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మునగాల మండల పరిధిలోని మోద్దుల చెరువు శివారులో వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిది చివ్వెల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన యువతి , యువకుడిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. యువజంట ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తీవ్ర మనస్థాపానికి గురైన జంట రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. బైక్‌పై మోద్దుల చెరువు స్టేజ్ దగ్గరికి వచ్చి పొలంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలంలో బైక్ ఉంది. చెట్టుకు వేలాడుతున్న జంటని ఈ రోజు ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.