Begin typing your search above and press return to search.

ఖండాలు దాటిన ప్రేమ : తెలంగాణ అబ్బాయి - అమెరికా అమ్మాయి

By:  Tupaki Desk   |   8 Jan 2021 6:52 PM IST
ఖండాలు దాటిన ప్రేమ : తెలంగాణ అబ్బాయి - అమెరికా అమ్మాయి
X
వారి ప్రేమ ఖండాలను దాటింది. దేశాల సరిహద్దులను పవిత్ర బంధంతో ముడేసింది. అమెరికా యువతి.. ఖమ్మం జిల్లా యువకుడు పెళ్లిబంధంతో ఏకమయ్యారు. ప్రేమకి కులం , మతం , జాతి తో పాటుగా దేశం తో కూడా ఆపనిలేదని నిరూపించారు. ఖండాతరాలు దాటిన తమ ప్రేమను మూడుముళ్ల బంధంతో ఒక్కటైయ్యారు. అమెరికాలో ప్రేమించుకున్న జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులు నడుమ అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణ మండపం వేదికగా సుజాత నగర్‌ మండలం అంజనాపురం అబ్బాయి, అమెరికా అమ్మాయి వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. ఆచంట వెంకటమోహన్‌ రావు, శ్రీలత దంపతుల కుమారుడు రాజీవ్‌ , అమెరికాలోని డెట్రాయిట్‌ లో ఓ కంపెనీలో ఇంజనీర్ ‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో డేవిడ్‌ లావెర్‌, కారెల్‌ లావెర్‌ ల ద్వితీయ పుత్రిక ఎలిజబెత్‌ తో ప్రేమలో పడ్డారు. పెద్దల నుంచి వారి ప్రేమకు అంగీకారం లభించింది. భారత్‌కు వచ్చి పెళ్లి చేసుకునేందుకు కరోనా నిబంధనలు అడ్డురావడంతో సుమారు ఏడాది పాటు నిరీక్షించారు. ఎట్టకేలకు గత నెల 30న ఆ ప్రేమికులు అంజనాపురానికి చేరుకున్నారు. పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో గురువారం సాయంత్రం బంధుమిత్రుల ఆశీస్సుల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఖండాలు దాటిన ప్రేమ… వివాహ బంధంతో ఒక్కటైంది. భారత సంప్రదాయాలు గొప్పవని.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని లిజబెత్‌ తెలిపింది