Begin typing your search above and press return to search.
ఒక్క ట్వీట్ తో ఆ కుబేరుడి లక్ష కోట్లు హుష్ కాకి
By: Tupaki Desk | 24 Feb 2021 7:00 AM ISTప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఇటీవలే మారి మళ్లీ సెకండ్ ప్లేసుకు దిగజారిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక్కరోజులో ఒక్క ట్వీట్ తో లక్ష కోట్లను కోల్పోయాడు. ఏంటా ట్వీట్..? ఎందుకు చేశాడిలా? అనేది ఆసక్తిగా మారింది.ఒకే ఒక్క ట్వీట్ తో టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ 15 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో (రూ.1.10 లక్షల కోట్లు) కోల్పోయాడు.
సాధారణంగా బిట్ కాయిన్ కు అనుకూలంగా ట్వీట్లు చేసే మస్క్.. గత వారం ఎథర్ క్రిప్టోకరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని తాజాగా ట్వీట్ చేశాడు. అదే ఆయనపై మదుపర్లలో విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది.దీంతో వెంటనే స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్ విలువ 8.6శాతం పడిపోయింది. 2020 సెప్టెంబర్ తర్వాత టెస్లా షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.