Begin typing your search above and press return to search.

మోడీకి హిందీ అలా వచ్చిందంట

By:  Tupaki Desk   |   10 Sept 2015 8:28 PM IST
మోడీకి హిందీ అలా వచ్చిందంట
X
దేశ ప్రజల మనసుల్ని దోచుకునేలా మాట్లాడే అతికొద్ది మంది నేతల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటారు. ఆయన నోటి నుంచి వచ్చే హిందీ.. భాష రాని వారిని సైతం కదిలించే శక్తి ఉంటుంది. ఆయన మాటలు మ్యాజిక్ మాదిరి ఉండటం తెలిసిందే.

గుజరాతీ అయిన మోడీ కి హిందీ అంతబాగా ఎలా వచ్చి ఉంటుంది? ఆయన హిందీ ఎక్కడ నేర్చుకొని ఉంటారు? చిన్నతనంలో టీలు అమ్మిన కుర్రాడికి.. హిందీ రావటం ఎలా సాధ్యమైంది? లాంటి ప్రశ్నలకు తానే బదులిచ్చారు మోడీ.

అంతర్జాతీయ హిందీ సమ్మేళనంలో పాల్గొన్న మోడీ తానింత బాగా హిందీ మాట్లాడటానికి కారణాన్ని వివరించారు. చిన్నతనంలో కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు వీలుగా రైల్వే స్టేషన్ లలో టీలు అమ్మటం తెలిసిందే. అలా టీ అమ్మే సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే పశువుల యజమానులతో హిందీలో మాట్లాడేవాడినని.. అలా వారితో మాటలు కలపటం వల్ల హిందీ వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఒకవేళ తాను కానీ.. యూపీ వ్యాపారులతో గుజరాతీ లోనే మాట్లాడి ఉంటే తాను హిందీలో మాట్లాడటం సాధ్యమయ్యేది కాదని వివరించారు. దేశ ఐక్యతకు హిందీ అత్యవసరమని చెప్పిన మోడీ.. హిందీని బలోపేతం చేయటానికి ప్రజలంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి హిందీలో మోడీ పట్టు వెనుకున్న అసలు విషయం అర్థమైందా..?