Begin typing your search above and press return to search.
వందల ఏళ్ల క్రితం చనిపోయిన ఆ మొఘల్ రాజు సమాధి కోసం కేంద్రం వెతుకులాట
By: Tupaki Desk | 20 Feb 2020 2:30 PM ISTఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకోవటం మోడీ సర్కారుకు అలవాటే. తాజాగా అలాంటి పనే మరోసారి చేసింది. మొఘల్ రాజులు అన్నంతనే చరిత్ర చదువుకున్న వారికి గుర్తుకు వచ్చేది బాబర్.. హుమయిన్.. అక్బర్.. షాజహాన్.. ఔరంగజేబులే. మొఘల్ రాజులు చాలామంది ఉన్నా గుర్తుండేది మాత్రం కొందరే. అలా చరిత్ర మరుగున పడిపోయిన ఒక రాజు సమాధి కోసం మోడీ సర్కారు వెతుకులాట మొదలు పెట్టింది. చరిత్రకారులకు తప్పించి.. మామూలోళ్లకు పెద్దగా పరిచయం లేని షాజహాన్ వారసుడు..ఔరంగజేబు అన్న సమాధిని వెలికి తీయటం కోసం కేంద్రం ఇప్పుడు తహతహలాడుతోంది. ఎందుకని? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చరిత్ర గురించి ఆసక్తిని పెంచేలా చేస్తున్న ఈ చర్య వెనుక అసలు కారణం ఏమిటన్నది చూస్తే..
దారా షికో అన్న పేరు చెప్పినంతనే చాలామందికి గుర్తుకు రాదు. చరిత్రకారులు.. అందునా మొఘల్ సామ్రాజ్యం గురించి స్టడీ చేసిన వారు మాత్రం ఈ పేరును ఇట్టే గుర్తిస్తారు. అప్పుడెప్పుడో 360 ఏళ్ల క్రితం నాటి ముచ్చటే అయినప్పటికీ.. ఈ డిజిటల్ యుగంలో అతడి అవసరం వచ్చి పడింది. ఇన్ని వందల ఏళ్లలో అతడి గురించి ఎవరికి పట్టకున్నా.. మోడీ సర్కారు మాత్రం ఇతగాడి కోసం అన్వేషిస్తుంది. అతడి సమాధి ఎక్కడుందో గుర్తించేందుకు ఏడుగురు ప్రసిద్ధ చరిత్రకారులతో ఒక కమిటీ వేసింది. మూడు నెలలు టైమిచ్చింది. అప్పటిలోపు వారు దారా షికో సమాధిని గుర్తించాలన్న లక్ష్యం పెట్టింది.
ఇంతకీ ఈ మొఘల్ రాజు గొప్పతనం ఏమిటి? మోడీ సర్కారుకు అతడి మీద ప్రేమ ఎందుకు పుట్టింది? అతడి సమాధిని గుర్తించాలని ఎందుకు తహతహలాడిపోతోంది? చరిత్రలో అతడి పేరు ఎందుకని చాలామందికి తెలీదన్న విషయాల్లోకి వెళితే.. చరిత్ర.. విజేతల్ని మాత్రమే గుర్తిస్తుంది. వాడు మంచోడైనా.. చెడ్డోడైనా.. అధికారాన్ని చేజిక్కించుకున్న వారికి దక్కే పేరు ప్రఖ్యాతులు.. మిగిలిన వారికి దక్కవు.
దారా షికోది కూడా అలాంటి ఉదంతమే. తాజ్ మహల్ కట్టిన మొఘల్ మహరాజు షాజహాన్ పెద్ద కొడుకు. తన వారసుడిగా ప్రకటించిన ఆయన అత్యంత దారుణంగా చంపేస్తాడు ఔరంగజేబు. తాను మహరాజు కావాలన్న ఉద్దేశంతో అన్న మీద యుద్ధం ప్రకటించి.. అందులో అతడ్ని ఓడిస్తాడు. దారుణమైన రీతిలో చిత్ర హింసలు పెట్టి చంపేస్తాడు. చనిపోయిన శవాన్ని తీసుకొస్తే.. దాన్ని కూడా తన కత్తితో అదే పనిగా పొడిచి కసి తీర్చుకుంటాడు ఔరంగజేబు. అంతేనా.. అతడి తలను తెగనరికి.. దాన్ని ఒక పెట్టెలో పెట్టి.. ఖైదీగా ఉన్న తన తండ్రికి బహుమతిగా పంపి మరీ తన కసి తీర్చుకుంటాడు.
ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తాడు ఔరంగజేబు అంటే.. తన రాజ్యాధికారానికి అడ్డుగా ఉన్న దారా షికో అంటే ఈ మొఘల్ రాజుకు అస్సలు నచ్చదు. షాజహాన్ కుమారుల్లో పెద్దవాడైన దారా 1615 మార్చి 11న పుట్టాడు. మొఘల్ సామ్రాజ్యంలో ఉదారవాదిగా అతడికి మంచి పేరు ఉంది. పదమూడు మంది అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు ఉన్న దారాకు యుక్తవయసు వచ్చేసరికి మిగిలింది ఆరుగురే. వారిలో ఔరంగజేబు ఒకరు. దారాలో తన తమ్ముడు ఔరంగజేబు మాదిరి ఛాందసభావాలు కనిపించవు. ముత్తాత అక్బర్ మాదిరి అన్ని మతాలను సమాన రీతిలో గౌరవించిన సంస్కారవంతుడిగా పేరుంది.
అన్నింటికంటే ముఖ్యమైనది హిందూ మతంపై గౌరవం ఉన్న వ్యక్తి. అద్భుతమైన కవి.అంతకు మించిన యుద్ధ వీరుడు కూడా. తన వారసుడిగా దారాను చాలా ఏళ్ల ముందే చక్రవర్తి షాజహాన్ ప్రకటించటం ఔరంగజేబుకు అస్సలు నచ్చలేదు. మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలన్న ఆశను తీర్చుకునేందుకు అన్నను అత్యంత దారుణంగా హతమారుస్తాడు. మరి.. అప్పుడెప్పుడో విషాదభరితంగా మరణించిన దారా సమాధి అవసరం మోడీ సర్కారుకు ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు సందేహంగా మారుతుంది. అక్కడికే వస్తున్నాం.
హైందవం.. ఇస్లామిక్ సంప్రదాయాల మధ్య సారూప్యతను వందల ఏళ్ల క్రితమే విశ్లేషించాడు. అప్పట్లోనే అంతలా ఆలోచించిన మేధావి మరొకరు చరిత్రలో కనిపించరు. ఉపనిషత్తుల గొప్పదనాన్ని గుర్తించిన పర్షియాలోకి ట్రాన్స్ లేట్ చేయటం ఎందరినో ప్రభావితం చేసింది. ఈ మధ్యన సంఘ్ పరివార్ కు చెందినకొందరు దారాను అసలుసిసలు హిందూస్థానీ అంటూ అభివర్ణించారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీలో షికో పేరిట ఒక పరిశోధన విభాగం గత ఏడాది స్టార్ట్ అయ్యింది.
భారత్ లో నిజమైన ముస్లిం అంటే భారతీయ సంస్కృతి ని అర్థం చేసుకొని హైందవం లో కలిసి మెలిసి జీవించటమేనని చెప్పేందుకే మోడీ సర్కార్ అతడ్ని హైలెట్ చేయాలన్న ఆలోచన లో ఉన్నట్లు చెబుతారు. అందుకే.. అతడి సమాధిని వెతికేందుకు ఒక కమిటీ వేసి.. వారికి టైం లిమిట్ పెట్టి గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అతడి సమాధిని గుర్తించిన తర్వాత.. భారతీయ ముస్లిం అంటే ఇలా ఉండాలన్న వాదనను తెర మీదకు తీసుకురావటమే లక్ష్యమంటున్నారు. చరిత్రలో మరుగున పడిన మొఘల్ రాజు.. మోడీ పుణ్యమా అని వందల ఏళ్ల తర్వాత సామాన్యులందరికి సుపరిచం కానున్నాడన్న మాట.