Begin typing your search above and press return to search.

అల‌ర్ట్ః దీర్ఘ‌కాలిక కొవిడ్ వ‌స్తే అంతే.. ఏడాది గ‌డిచినా స‌రే!

By:  Tupaki Desk   |   16 April 2021 4:00 PM IST
అల‌ర్ట్ః దీర్ఘ‌కాలిక కొవిడ్ వ‌స్తే అంతే.. ఏడాది గ‌డిచినా స‌రే!
X
కొవిడ్ క్వారంటైన్ స‌మ‌యం 14 రోజులు. వైర‌స్ ఒంట్లో ఉన్న‌దీ లేనిదీ తేలిపోతుంది. ఒక‌వేళ కొవిడ్ బారిన ప‌డితే.. వారిలోని రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ట్టి రోజుల్లోనే సాధార‌ణ మ‌నుషులు కావొచ్చు. లేదంటే.. మూడ్నాలుగు వారాలు ప‌ట్టొచ్చు. కానీ.. వారాల సంఖ్య పెరుగుతూ పోతే..? నెల‌లు గ‌డుస్తున్నా త‌గ్గ‌క‌పోతే..? సంవత్సరం గడిచినా ప్రభావం కొనసాగితే..? ఇప్పుడు.. ఈ అరుదైన ల‌క్ష‌ణం విస్త‌రిస్తోంది! ‘దీర్ఘకాలిక కొవిడ్’గా పిలిచే ఈ ర‌కం వ్యాపిస్తే ఎన్నో దారుణాల‌ను ఫేస్ చేయాల్సి వ‌స్తుంది!

లండ‌న్ కు చెందిన 31 సంవ‌త్స‌రాల జాస్మిన్ హేయ‌ర్.. గ‌త మార్చిలో ఇలాంటి కొవిడ్ బారినే ప‌డ్డారు. ఊపిరి తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతూ వ‌చ్చింది. అల‌స‌ట‌, ద‌గ్గు, త‌ల‌నొప్పి, కీళ్ల‌నొప్పులు.. ఒక‌టేమిటి..? అన్నిరకాల సమస్యలూ చుట్టుముట్టాయి. కానీ.. ఇప్ప‌టికీ ఆ మ‌హ‌మ్మారి ఆమెను వ‌దిలిపెట్ట‌లేదు.

35 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన మహిళల్లో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలో వైర‌స్ ఎన్ని ర‌కాలుగా రూపాంత‌రం చెందిందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. బ్రెజిల్ స్ట్రెయిన్‌, సౌతాఫ్రికా, బ్రిట‌న్ లో వెలుగు చూసిన ప్ర‌మాద‌క‌ర వైర‌స్ లు ప్ర‌పంచాన్ని భ‌యపెడుతున్నాయి. రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్న కొవిడ్ వైర‌స్‌.. ఇంకా ఎన్నిర‌కాలుగా మారిపోతుందో అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు నిపుణులు.

అలాంటి వాటిలో దీర్ఘ‌కాలిక కొవిడ్ కూడా ఒక‌టి. కొంత మందిలో వైర‌స్ వ్యాపించిన 5 వారాల త‌ర్వాత ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుండ‌గా.. మ‌రికొంత మందిలో 12 వారాల త‌ర్వాత అంటే.. మూడు నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ ర‌కం సోకిన వారిలో వ్యాధిని గుర్తించ‌డ‌మే చాలా క‌ష్టంగా మారుతోంద‌ట‌. ఇక‌, ఖ‌చ్చిత‌మైన మెడిసిన్ లేని ఈ వైర‌స్ సోకితే.. రోగులు నానా అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తోంది జాస్మిన్ అనుభ‌వం.

ఏడాది కాలం అవుతున్నా.. ఇప్ప‌టికీ ఆమె స‌రిగ్గా న‌డ‌వ‌డానికి, వేగంగా మాట్లాడ‌టానికి కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంద‌ట‌. తాను ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను వివ‌రించి, జ‌నాల్లో అవగాహ‌న తేవ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు జాస్మిన్‌. అయితే.. వైర‌స్ సోకిన త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఎవ్వ‌రూ చెప్ప‌లేని అంశం. అందువ‌ల్ల.. చికిత్స క‌న్నా నివార‌ణ మేలు అనే ప‌ద్ధ‌తిన ముందు జాగ్ర‌త్త‌లు పాటించ‌డ‌మే అన్నింటిక‌న్నా ఉత్త‌మం. కాబ‌ట్టి.. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రంచ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, నిరంత‌రం శానిటైజ్ చేసుకోవ‌డం వంటి చ‌ర్య‌ల ద్వారా కొవిడ్ సోక‌కుండా చూసుకోవ‌డ‌మే ఇప్పుడు ప్ర‌జ‌లంతా చేయాల్సింది.