Begin typing your search above and press return to search.

కంటిని చూసి లాంగ్ కోవిడ్ తో ఉందొ లేదో చెప్తారట !

By:  Tupaki Desk   |   28 July 2021 5:00 PM IST
కంటిని చూసి లాంగ్ కోవిడ్ తో ఉందొ లేదో చెప్తారట !
X
లాంగ్ కోవిడ్ .. కోవిడ్ వచ్చిన వాళ్లలో కొంత మంది హాస్పిటల్ కి వెళ్లి వస్తున్నారు. కొంత మంది తమ ఇంట్లోనే ఐసొలేట్ అవుతున్నారు. రెండు వారాల్లో కరోనా వైరస్ నెగటివ్ రిపోర్టు వస్తోంది. ఆ రెండు వారాలు జాగ్రత్తగా ఉంటే చాలని అందరూ అనుకుంటున్నారు. ఈ ధైర్యమే కరోనా వైరస్ నుండి కాపాడుతుంది. అధైర్యపడకుండా అలాగే ఓ ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. నెగటివ్ వస్తే కోవిడ్ పూర్తిగా పోయినట్లు కాదు. దాని మూలంగా ఆగమైన అవయవాలు మళ్లీ ఒకప్పటిలా పనిచేయడానికి కొంతకాలం పడుతుందట. అప్పటిదాకా కొన్ని చిన్న ఇబ్బందులు తప్పవంటున్నారు. ఆ ఇబ్బంది పేరే లాంగ్ కోవిడ్ సిండ్రోమ్.

కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని కొన్ని దేశాల్లో కరోనా రోగులపై జరిగిన స్టడీస్ చెబుతున్నాయి. కరోనా వైరస్ బారినపడిన వాళ్లు ఆ తర్వాత లాంగ్ కొవిడ్ బారినపడే ప్రమాదం ఉందని అనేక దేశాల డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లాంగ్ కొవిడ్ బాధితుల్లో కచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయని చెప్పలేం. మీ కంటిని చూసి మీరు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నారో లేదో డాక్టర్లు ఇట్టే చెప్పేస్తారు. టర్కీలోని ఎర్బాకన్ యూనివర్సిటీ పరిశోధకులు కార్నియాలో నెర్వ్ డ్యామేజ్ చూసి కనుగొంటున్నారు. అనేక రకాల వ్యాధులు డయాబెటిస్, ఫైబ్రోమైలాగియా లాంటి వాటిలోనూ కార్నియాలో మార్పులు ఉంటాయి.

కార్నియాలో నెర్వ్ డ్యామేజ్ ను నాన్ ఇన్ వేసివ్ లేజర్ టెక్నిక్ ద్వారా గుర్తించొచ్చు. దీన్ని కార్నియల్ కాన్ ఫోకల్ మైక్రోస్కోపీ అంటారు. పరిశోధకులు సీసీఎం ద్వారా గతంలో కరోనా బారిన పడ్డ 40మంది, ఆరోగ్యంగా ఉన్న 30మందిని టెస్ట్ చేశారు. లాంగ్ కొవిడ్ ఉన్న వారిలో కార్నియా నెర్వ్ ఫైబర్ డ్యామేజ్, లాస్ ను గుర్తించారు. అంతేకాదు వారిలో డెన్ డ్రిటిక్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కార్నియా నెర్వ్ లాస్, డీసీ డెన్సిటీ ఎక్కువగా ఉంది. అంటే వారు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నట్టు చెప్పగలం అని పరిశోధకులు తెలిపారు.

ఈ పరిశోధనల ద్వారా తెలిసింది ఏమిటంటే.. నెర్వ్స్ ను కొవిడ్ డ్యామేజ్ లేదా లాస్ చేయగలదని, దీన్నే పెరిఫెరల్ న్యూరోపతి అంటారని చెప్పారు. పెరిఫెరల్ నెర్వస్ వ్యవస్థ అనేది కేంద్ర నాడీ వ్యవస్థ వెలుపల ఉండే నరాల నెట్‌వర్క్. UK డయాబెటిస్ లో పెరిఫెరల్ న్యూరోపతికి అత్యంత సాధారణ కారణం. కాలక్రమేణా అధిక రక్తంలో చక్కెర స్థాయిలు నరాలు క్షీణించడానికి కారణమవుతాయి. పాదాలలో తిమ్మిరి, కండరాల తిమ్మిరి, అధిక చెమట వంటి అనేక సమస్యలతో పాటు, పెరిఫెరల్ న్యూరోపతి కళ్లను కేంద్రీకరించడంలో డబుల్ విజన్ లేదా ఇతర సమస్యలను కలిగిస్తుంది. కొన్నిసార్లు కంటి నొప్పి కలుగుతుంది.