Begin typing your search above and press return to search.

ఒంటరితనం క్యాన్సర్ కు కారణం.. పొగతాగడం కన్నా డేంజర్!

By:  Tupaki Desk   |   20 May 2021 11:30 PM GMT
ఒంటరితనం క్యాన్సర్ కు కారణం.. పొగతాగడం కన్నా డేంజర్!
X
ఇటీవల కాలంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఎదురుగా మనిషి ఉన్నా ఫోన్ల ద్వారానే మాట్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మారుతున్న కాలంతో పాటు సమస్యలు పెరిగాయి. మరి ఈ కంప్యూటర్ కాలంలో ఎక్కువగా మానసిక సమస్యలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒంటరితనం మొదటిది. ఒంటరితనం, ఏకాంతం రెండు వేర్వేరు. ఈ రెండింటిని ఎప్పుడూ కలిపి చూడకూడదు.

ఏకాంతంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరితనంలో ఆందోళనలతో మనస్సు కుంగిపోతుంది. ఈ ఒంటరితనం సమస్య చాలా డేంజర్ అని ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఓ మనిషి పొగతాగడం, అధిక బరువు పెరగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో... ఒంటరిగా ఉండడం అంతకుమించి అనారోగ్యమని ఈస్ట్ ఫిన్లాండ్ కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది.

ఒంటరితనం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. 2570 మంది మధ్యవయస్కులపై నిర్వహించిన పరిశోధనల్లో వెలువడిన ఫలితాలను వెల్లడించారు. వారిలో 25 శాతం మంది క్యాన్సర్ బారిన పడగా... 11శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఒంటరితనంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.

వయస్సు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, నిద్రలేమి, జీవనశైలి, ఒత్తిడి వంటి సమస్యలు కాకుండా క్యాన్సర్ తోనే చాలామంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. వారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్నవారు, భాగస్వాములను కోల్పోయిన వారు చాలామంది ఉన్నారని వెల్లడించారు. సాధ్యమైనంత వరకు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని చెబుతున్నారు. సామాజిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు.