Begin typing your search above and press return to search.

నెలకు తేల్చారు..లండన్ బీచ్ లో దొరికిన బాడీ శ్రీహర్షేనట

By:  Tupaki Desk   |   18 Sept 2019 11:12 AM IST
నెలకు తేల్చారు..లండన్ బీచ్ లో దొరికిన బాడీ శ్రీహర్షేనట
X
ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నన్నె ఉదయ్ ప్రతాప్ కుమారుడు శ్రీహర్ష మిస్సింగ్.. తర్వాత శవమై లండన్ బీచ్ లో దొరకటం.. ఆ డెడ్ బాడీ అతనిదేనా? కాదా? అన్న సందేహాలు వెల్లువెత్తటం తెలిసిందే. లండన్ లో ఎమ్మెస్సీ చదివేందుకు వెళ్లిన అతడు మిస్ కావటం సంచలనంగా మారింది. అనంతరం లండన్ బీచ్ లో ఒక యువకుడి డెడ్ బాడీ లభించటం.. అది శ్రీహర్షదేనన్నసందేహాలు వ్యక్తం కావటం తెలిసిందే.

ఒకదశలో లండన్ బీచ్ లో దొరికింది శ్రీహర్షేనన్న నిర్దరాణకు వచ్చినప్పటికి.. సాంకేతికంగా అతను శ్రీహర్షా? కాదా? అన్న విషయం తేల్చేందుకు పలు పరీక్షలు నిర్వహించారు. దాదాపు నెల రోజుల (ఆగస్టు 21న మిస్సింగ్) తర్వాత కానీ శ్రీహర్ష డెడ్ బాడీ అతనిదే అన్న విషయాన్ని తేల్చటానికి లండన్ పోలీసులకు పట్టిందని చెప్పాలి.

ఇటీవల నిర్వహించిన డీఎన్ఏ పరీక్షతో పలు టెస్టులు నిర్వహించి లండన్ ఈస్ట్ బోర్న్ బీచ్ వద్ద లభించిన డెడ్ బాడీ శ్రీహర్షదేనని ఖరారు చేశారు. రేపు (గురువారం) శ్రీహర్ష మృతదేహాన్ని ఖమ్మంకు తీసుకురానున్నారు. ఇదంతా చదువుతున్నప్పుడు..ఆ కుటుంబం మానసికంగా ఎంతటి వేదనను అనుభవించి ఉంటుందన్నది తలుచుకోవటానికి సైతం భయాందోళనలు కలగటం ఖాయం.