Begin typing your search above and press return to search.

సెల్ చూస్తూ నడిచే వారి కోసం ప్రత్యేక రోడ్డు?

By:  Tupaki Desk   |   4 Oct 2019 5:31 AM GMT
సెల్ చూస్తూ నడిచే వారి కోసం ప్రత్యేక రోడ్డు?
X
ఆలోచించటానికే అత్యాశగా ఉండే సౌకర్యం ఆ దేశ ప్రజలకు సొంతమైంది. ప్రజా ప్రభుత్వం ప్రజల హితవు కోసం.. వారి సంక్షేమం కోసం.. అవసరాల కోసం ఉండాలే తప్పించి మరింకేమీ కాదన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మన దగ్గర ప్రయాణం చేస్తాంరా మొర్రో అంటే తగినన్ని రైళ్లు.. బస్సులు కూడా వేయలేని దద్దమ్మ ప్రభుత్వాలుంటే.. మనల్ని వందల ఏళ్లు బానిసలు మాదిరి పాలించిన బ్రిటీషోళ్లు ఎంత ముందున్నారో చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

ప్రపంచానికి పట్టిన మొదటి శని టీవీ అయితే.. రెండో శని సెల్ ఫోను.. అందులో ఇంటర్నెట్ కనెక్షన్ గా పలువురు అభివర్ణిస్తారు. దీనికి తగ్గట్లే చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని రోడ్డు మీద సైతం దాన్లో లీనమైపోయి.. ఎదురు ఎవరు వస్తున్నారో.. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు కోల్పోయిన వారెందరో. ఇలాంటి వారు మన దగ్గరే కాదు బ్రిటన్ లోనూ ఎక్కువేనట.

రోడ్డు మీద నడుస్తూ సెల్ లో మునిగిపోయే రోగం లండన్ ప్రజల్లో 75 శాతం మందికి ఉందట. ఎంతకూ మారని ప్రజలు ఇబ్బందులకు గురి కావటం చూసిన అక్కడి ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. వారి కోసం ప్రత్యేకంగా రోడ్డు వేసేశారు. మాంచెస్టర్ లోని ఒక రద్దీ ప్రాంతంలో మొబైల్ పాదచారుల కోసం ప్రత్యేక రోడ్ లైన్ వేసేవారు.

మొబైల్ ఫోన్ సేఫ్ లెన్స్ పేరుతో 75 మీటర్ల పొడవైన రోడ్డు వేశారు. రోడ్డు అటు.. ఇటు నడిచే వారి కోసం వేర్వేరు గీతలు ఉంటాయి. ఈ రోడ్డుతో అయినా.. మనుషులు సెల్ ఫోన్ చూస్తే నడవటమే కాదు.. ఒకరినొకరు తాకకుండా నడవాలన్నదే అధికారుల ఉద్దేశంగా చెబుతున్నారు. ఇలాంటి సౌకర్యం మన దగ్గర మరో వందేళ్లు అయినా సాధ్యం కాదేమో?