Begin typing your search above and press return to search.

ట్రాక్టర్​ నడుపుతూ తడబడ్డ లోకేశ్.. డ్రెయిన్లోకి వాహనం.. కేసు నమోదు

By:  Tupaki Desk   |   27 Oct 2020 9:30 AM IST
ట్రాక్టర్​ నడుపుతూ  తడబడ్డ లోకేశ్.. డ్రెయిన్లోకి వాహనం.. కేసు నమోదు
X
కరోనా కారణంగా కొద్ది కాలంపాటు ఇంటికి పరిమితమైన టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఇప్పడిప్పుడే ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. తాజాగా ట్రాక్టర్​ నడపబోయి తడబడ్డాడు. అదుపుతప్పిన ట్రాక్టర్​ డ్రెయిన్​లోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఎం జరిగిందంటే..

నారా లోకేశ్‌ సోమవారం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆకివీడు నుంచి లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ వెళుతుండగా.. సిద్ధాపురం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న చినకాపవరం డ్రెయిన్‌లోకి దూసుకుపోయింది. స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ ఇంజిన్‌ ఆపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం లోకేశ్​ సిద్దాపూర్​లో పర్యటించారు.


లోకేశ్‌పై కేసు నమోదు

కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు లోకేశ్​పై కేసు నమోదంది. సుమోటోగా కేసు నమోదు చేసినట్టు ఆకివీడు ఎస్సై వై వీరభద్రరావు పేర్కొన్నారు. అంటువ్యాధుల చట్టాన్ని ఉల్లంఘించి, కరోనా నిబంధనల్ని అతిక్రమించి ముంపు ప్రాంతాల్లో పర్యటించినందుకు కేసు నమోదు చేశామన్నారు. లోకేశ్‌ 15 మందిని ట్రాక్టర్‌పై ఎక్కించుకుని నడిపారని ఇది నిబంధనలకు విరుద్ధమని పోలీసులు చెప్పారు.