Begin typing your search above and press return to search.
కేటీఆర్ - రాంచరణ్ లా లోకేష్ ఎదగాలి!
By: Tupaki Desk | 5 May 2020 4:20 PM ISTఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు ఎవరి మీద పడుతాడో ఎవరికి తెలియదు.. చాలా కాలం కిందట సినిమాలకు విరామం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు బండ్ల గణేష్. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ సహా టీఆర్ఎస్ పై ఆయన విమర్శలు, కామెంట్స్ వైరల్ అయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే 7ఓ క్లాక్ బ్లేడుతో మెడ కోసుకుంటానన్న ఆయన డైలాగ్ బాగా పేలింది. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేయడంతో బాధపడ్డాడు. చాలా కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు.
ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ కరోనా విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, చర్యలు చూసి అబ్బురపడి ఆయన దైవాంస సంభూతుడు అంటూ ట్వీట్స్ చేసి బండ్ల గణేష్ అభిమానం చాటుకున్నాడు. కొద్దిరోజులుగా తెలంగాణ సీఎంను ఆకాశానికెత్తేస్తున్న బండ్ల గణేష్ తాజాగా తెలుగుదేశం పార్టీ భావి వారసుడు నారా లోకేష్ పై పడ్డాడు. ఆయనను లక్ష్యంగా చేసుకొని వరుస ట్వీట్స్ చేస్తూ బెంబేలెత్తించారు.
తాజాగా బండ్ల గణేష్ ట్వీట్స్ చేస్తూ.. యువ టీడీపీ నాయకుడు లోకేష్ బాబు భావి రాజకీయ నాయకుడిగా మారడానికి చంద్రబాబు కుమారుడనే తప్ప వేరే అర్హత లేదని బండ్ల కడిగిపారేశారు. మీరు రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడంటూ ఆడిపోసుకున్నారు. ‘ప్రియమైన లోకేష్.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. చిరంజీవి కుమారుడు రాంచరణ్ లు ఎలా తండ్రికి తగ్గ తనయులు అయ్యారో.. గట్టి పోటీనిస్తున్నారో మీరు కూడా అలా ఎదగాలని కోరుకుంటున్నా’ అంటూ లోకేష్ కు హితబోధ చేశారు బండ్ల గణేష్. ప్రజలను ప్రేమతో గెలవాలని లోకేష్ కు సలహా ఇచ్చాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలలాంటి ట్విట్టర్ ఖాతాలను నడపడం ద్వారా కాదని ఎద్దేవా చేశారు.
ఇక ఏపీ సీఎం జగన్ ను బండ్ల గణేష్ వేయినోళ్ల పొగిడాడు.. ‘తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్థులు అందరూ ఒక్కటై అణచివేయాలని చూసిన అందర్నీ ఎదిరించి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైయస్ జగన్మోహన్ రెడ్డిలాగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ లోకేష్ ను ఎద్దేవా చేశారు బండ్ల గణేష్.
ఇక లోకేష్ కు ప్రధాన పోటీదారు అయిన జూనియర్ ఎన్టీఆర్ ను బండ్ల గణేష్ ఆకాశానికెత్తేశారు. ‘ఎవరు ఏ విధమైన సపోర్ట్ చేయకపోయినా నంబర్ వన్ పొజిషన్ కి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా మీరు వుండాలి’ అంటూ పోల్చి లోకేష్ ను కడిగేశాడు బండ్ల గణేష్.
ఒక్కటేమిటీ వరుసగా పది ట్వీట్ల వరకు ఇలా నారాలోకేష్ అసమర్థత, అపరిపక్వత, నాయకత్వ లోపంపై బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పి మరీ బండ్ల గణేష్ ఇలా లోకేష్ ను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.