Begin typing your search above and press return to search.
నువ్వే వచ్చిపో .. వడ్డీతో సహా చెల్లిస్తాం: ట్విట్టర్ లో లోకేష్ సెటైర్లు
By: Tupaki Desk | 17 Sept 2021 6:23 PM ISTఏపీలో రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య అగ్గిరాజేశాయి. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా ఉండవల్లిలోని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వైసీపీ కార్యకర్తలతో సహా అక్కడికి వెళ్లారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పోలీసులు వచ్చి అతి కష్టం మీద అక్కడి పరిస్థితులని అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే , ఈ ఘటన కారణంగా రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటం తో సీఎం జగన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్న నేపధ్యంలో అన్ని దారులను మూసేశారు. రాజకీయ విమర్శలు తట్టుకోలేకపోతే ఇళ్ళ మీద దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం ఉంటుందో, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం ఉంటుందని వైసిపి నేతలను హెచ్చరించారు. తాడేపల్లిలో జగన్ కొంప నుండి చంద్రబాబు నివాసానికి, చంద్రబాబు నివాసం నుండి జగన్ కొంపకు అంతే దూరం ఉంటుందని, తాము కూడా జగన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేయగలమని దాడులకు దిగగలమని, కాకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సంయమనం పాటించండి అని చెప్పడంతో సైలెంట్ గా ఉన్నామని చెప్తున్నారు. దీనితో ఏ క్షణం అయినా పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉండటం తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక ఈ వ్యవహారం ఇలా అంటే..ఈ ఘటన జరిగిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విరుచుకుపడ్డారు. జోగి రమేష్ తో పాటు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. లోకేష్ మాట్లాడుతూ ప్రతిపక్షనేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాలని పంపావంటేనే, నీ దిగజారుడుతనం అర్థమవుతోందని సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. జగన్ రోజురోజుకూ అధఃపాతాళంలోకి దిగజారుతున్నారన్నారు. తాడేపల్లిలోని నీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరమనే విషయం తెలుసుకునే రోజు త్వరలో వస్తుందని తెలిపారు.
జగన్ రెడ్డి గాలి హామీలు తేలిపోయాయని, ఒకప్పటి ఆయన ముద్దులే. ప్రస్తుతం పిడిగుద్దుల్లా పడుతున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ ది అంతా నాటకమనే విషయం. జనానికి తెలిసిపోయిందన్నారు. తమ పరిస్థతిపై ఉలిక్కిపడి, ప్రతిపక్షంపైకి రౌడీలను పంపుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, జగన్ లాంటి క్రూర, నేరస్వభావం కలవారు కాదని గుర్తు చేశారు. జనం తిరగబడే రోజు దగ్గరపడిందని ఉలిక్కిపడిప్రతిపక్షంపైకి వాళ్లనీ, వీళ్లనీ పంపడం ఎందుకు ? నువ్వే ఓసారి వచ్చిపోకూడదూ.. మా పెద్దాయన (చంద్రబాబు) నీలాంటి క్రూర, నేర స్వభావం ఉన్నోడు కాదు. నువ్వు ముంచేయాలని నిత్యం తపించే కరకట్ట పక్క ఇంట్లో టీ,స్నాక్స్ పెట్టి బొత్తిగా నీకు తెలియని అభివృద్ధి అంటే ఏంటి ? కొత్తగా పరిశ్రమలు ఎలా తీసుకురావాలి ? ఉపాధి-అవకాశాలు ఎలా పెంపొందించుకోవాలి? అనే అంశాలు చక్కగా వివరిస్తారు . కాదూ కూడదు అంటే ఇలాగే బ్లేడ్ బ్యాచ్ లను వేసుకొచ్చేస్తానంటే, నీ సరదాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కళ్లకీ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు.