Begin typing your search above and press return to search.
బాబు పవన్ మీటింగులో లోకేష్ మిస్సింగ్...?
By: Tupaki Desk | 8 Jan 2023 2:09 PM ISTనారా లోకేష్. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు. భావి వారసుడు. చంద్రబాబు తరువాత కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. ఒక విధంగా చెప్పాలీ అంటే ఈ రోజున చంద్రబాబు ఒక్కరే తెలుగుదేశాన్ని నడిపించడంలేదు, లోకేష్ కూడా అందులో భాగంగా ఉంటున్నారు. లోకేష్ ఆలోచనలు ఆయన ప్లాన్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో అమలు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అంతటి కీలక నాయకుడు లోకేష్ తెలుగుదేశం అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో కనిపించకపోవడం గమనార్హం. గతంలో అంటే చంద్రబాబు ఏపీ సీఎం గా ఉన్నపుడు పవన్ ఆయన్ని కలవడానికి వచ్చినపుడు బాబు పక్కనే లోకేష్ ఉన్నారు. కానీ ఈసారి ఇంతటి కీలక సమయంలో రెండు పార్టీల అధినేతలు కలుసుకునే సందర్భంలో లోకేష్ లేకపోవడం అంటే చాలా ఆలోచించాలి అని అంటున్నారు.
నిజానికి జనసేనతో పొత్తు అన్నది లోకేష్ కి ఇష్టం లేదు అన్న టాక్ అయితే నడుస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. దాని వల్ల తెలుగుదేశం పార్టీ నేరుగానే అధికారంలోకి వస్తుంది అన్న గట్టి నమ్మకం నారా లోకేష్ ఉంది అంటున్నారు. ఏపీలో గ్రౌండ్ లెవెల్ లో తెలుగుదేశం పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది అని కూడా చెబుతున్నారు.
పైగా క్యాడర్ కూడా కసి మీద పనిచేస్తోందని,అందుకే ఒంటరిగా పోరుకు వెళ్తే అనూహ్య ఫలితాలు వస్తాయని లోకేష్ లెక్క వేస్తున్నారు అని అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్ని రకాలైన ఎత్తులు వ్యూహాల్తోనే వైసీపీని ఓడించాలని అనుకుంటున్నారు. ఈసారి ఏ మాత్రం పొరపాట్లు చేయరాదు అన్నదే బాబు ఆలోచన అని చెబుతున్నారు.
ఒక విధంగా రాజకీయ కురు వృద్ధుడు చంద్రబాబుకు అసలు విషయాలు చాలా తెలుసు కాబట్టి ఆయన జనసేనను విడిగా పోటీ చేయనివ్వడంలేదు అని అంటున్నారు. ఇలా విడిగా పోటీ చేస్తే అనుకున్నది కాకపోగా విపక్షం ఓట్లు చీలిపోయి కచ్చితంగా వైసీపీ లాభపడుతుంది అన్న అంచనాలు ఏవో బాబుకు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ విషయంలో ఏ ఒక్క అవకాశాలను వదులుకోరాదని, అలాగే ఎక్కడా లూజ్ కారాదని కూడా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే టైట్ ఫైట్ ఇవ్వడానికే ఈ రెండు పార్టీల పొత్తు అని కూడా అంటున్నారు. పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు కూడా జగన్ని గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలసిరావాలని చాలా సార్లు పిలుపు ఇచ్చారు. అందువల్లనే ఇద్దరు నాయకులు కలసి పొత్తుల మీద మాట్లాడుకుంటారని అంటున్నారు. ఇక ఈ పొత్తుల వ్యవహారం పెద్దగా ఇష్టం లేని కారణంగానే లోకేష్ ఈ భేటీకి రాలేదని అంతున్నారు.
పైగా ఆయనని బాబు దూరం పెట్టారని కూడా అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం జనసేన పొత్తుల విషయంలో కధ ముందుకే అన్నది స్పష్టం అవుతోంది. అటూ ఇటూ ఇష్టం లేని వారు ఎవరైనా సైడ్ అవాల్సిందే తప్ప పొత్తులు మాత్రం ముందుకే అని అంటున్నారు. మరి లోకేష్ కూడా తండ్రి అనుభవానికే ఓటేసి జై అంటూ ముందుకు పోవాల్సిందే అని అంటున్నారు.