Begin typing your search above and press return to search.

అసెంబ్లీ లో లోకేష్.. షాకింగ్ లుక్

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:08 AM GMT
అసెంబ్లీ లో లోకేష్.. షాకింగ్ లుక్
X
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు అధికార పక్షం లో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో యమ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను సైతం అంటూ తొడగొట్టేస్తున్నారు. నిన్న ఆర్టీసీ బస్సు చార్జీలపై ఏకంగా పల్లె వెలుగు బస్సు ఎక్కి మరీ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈరోజు మరోసారి వినూత్న నిరసనతో అందరి దృష్టిని తనమీదకు మళ్లించారు.

మొదటిరోజు ఉల్లిదండలు వేసుకొని అసెంబ్లీకొచ్చిన టీడీపీ నేతలు.. రెండోరోజు రైతు సమస్యలపై నిరసన తెలిపారు. మూడోరోజు ఆర్టీసీ బస్సు చార్జీలు నాలుగోరోజైన నేడు మీడియా ఆంక్షలపై ఆందోళనకు పూనుకున్నారు.

తాజాగా గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ వద్ద నారా లోకేష్ కళ్లకు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. మీడియాంపై ఆంక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ఈ ఆందోళనలో లోకేష్ వెంట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ వరకూ ర్యాలీగా వెళ్లారు.

భద్రతా సిబ్బంది నల్లరిబ్బన్లతో వస్తున్న లోకేష్ టీంను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం నడిచింది. గేటు దగ్గరే బైటాయించి నిరసన తెలిపారు. ఈ నిరసన లో చంద్రబాబు, లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ పాల్గొన్నారు.