Begin typing your search above and press return to search.

లోకేష్ కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు!?

By:  Tupaki Desk   |   18 March 2021 9:30 AM GMT
లోకేష్ కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు!?
X
‘ఎవరూ లేకపోతే అక్క మొగుడే’ దిక్కన్నట్టు.. ఇప్పుడు ఏపీలో ఎవరు కలిసిరాకపోతే ఇక టీడీపీ నవయువ నాయకుడు లోకేష్ తప్ప బీజేపీకి మరో ఆప్షన్ లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలు సైతం నవరస నాయకుడు లోకేష్ ను మచ్చిక చేసుకోవడంపై దృష్టిసారించిందని భోగట్టా. ఈ మేరకు ఆయనకు పిలిచి ఢిల్లీ పెద్దలు మాట్లాడబోతున్నారని రాజకీయవర్గాల్లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ సమయం వస్తుందా? అసలు కథ ఏంటనేది తెలుసుకుందాం..

టీడీపీ అధినేత చంద్రబాబుకు రాకుండా.. ఆయన కుమారుడు లోకేష్ కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని హైదరాబాద్ నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీడీపీ వర్గాల్లో ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోందట.. తొందరలో లోకేష్ వెళ్లి బీజేపీ హైకమాండ్ పెద్దలను కలుస్తారని అనుకుంటున్నారట..

ఏపీలో బీజేపీకి పవన్ కళ్యాన్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందని.. ఆయనను నమ్ముకుంటే ఇబ్బంది వస్తోందని.. రాబోయే రోజుల్లో బీజేపీ ఏపీలో ఖాతా తెరవాలంటే టీడీపీ కొత్త బంధాన్ని పెట్టుకోవాలని కొందరు ఢిల్లీ పెద్దలకు చెప్పారంట..

పవన్ కళ్యాణ్ కు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడం ఇష్టం లేదు అని.. పవన్ కళ్యాణ్ మీద ఆధారపడితే ఇబ్బంది పడుతాం అని కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట.. లేకపోతే బీజేపీ కథ ఏపీలో ముగిసిపోతుందన్న ఆందోళన ఆ పార్టీ పెద్దల్లో ఉందట.. వైసీపీ ఊపులో ఉంది కాబట్టి వాళ్లు బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో జట్టు కట్టరు. అందుకే ఎన్నికల సమాయానికి బీజేపీతో జనసేనతో కానీ.. టీడీపీతో కానీ వెళితేనే ఏపీలో పార్టీ బతికి బట్టకడుతుందని ఆ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారని.. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ కు రిపోర్ట్ కూడా ఇచ్చారని జోరుగా ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు వయసు అయిపోయవడంతో ఇప్పుడా పార్టీకి లోకేష్ బాబే దిక్కు అంటున్నారు. ఆయన నాయకత్వంపై అనుమానాలున్నా.. ఏపీలో బలమైన పార్టీ ఆయన చేతిలో ఉండడంతో లోకేష్ ను ఈజీగా మచ్చిక చేసుకోవచ్చని కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట.. ఈ మేరకు జనసేన కాదంటే.. జగన్ దూరం పెడితే ఇక టీడీపీతో వెళ్లడం తప్ప బీజేపీకి ఆప్షన్ లేదంటున్నారు. చూడాలి మరీ బీజేపీ రాజకీయం ఎన్ని మలుపు లు తిరుగుతుందో..