Begin typing your search above and press return to search.

చంద్రబాబు మీద లోకేష్ అలక అందుకేనా?

By:  Tupaki Desk   |   31 Aug 2020 11:30 AM IST
చంద్రబాబు మీద లోకేష్ అలక అందుకేనా?
X
40 ఇయర్స్ చంద్రబాబు ఇంకా అప్పటి రాజకీయాలే చేస్తున్నాడు. యంగ్ సీఎం వైఎస్ జగన్ ధాటికి నిలవలేకపోతున్నారు.. ప్రశాంత్ కిషోర్ లాంటి ఈ తరం వ్యూహకర్తల వ్యూహాల ముందు చంద్రబాబు పాత చింతకాయపచ్చడి రాజకీయాలు పనిచేయడం లేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చివరకు ఆయన కుమారుడు నారా లోకేష్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాడా? అంటే ఔననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే ప్రక్షాళనపై బాబుతో లోకేష్ గొడపపడ్డాడని.. ఆయన వినకపోవడంతో అలకపాన్పు ఎక్కాడని అంటున్నారు. మరి ఏంటా కారణం.? లోకేష్ కే చిరాకు పుట్టే పనిని చంద్రబాబు ఏం చేశాడు? అసలు ఏంటా కథ అనేది తెలుసుకుందాం.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీద ఆయన కుమారుడైన లోకేష్ కొన్ని విషయాల్లో అలక వహించాడని తెలుస్తోంది. ఎందుకని ఆరాతీయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కృష్ణా జిల్లాలో టీడీపీ ఎప్పుడు కూడా చాలా బలంగానే ఉంటుంది. కానీ 2019 ఎన్నికల్లో ఎందుకో అమరావతి ప్రాంతంలో కూడా సాక్షాత్తూ లోకేష్ ఓడిపోయే పరిస్థితి దాపురించింది.

అయితే లోకేష్ ఈ మధ్య రాజకీయంగా అన్ని విషయాలను పరిశీలస్తున్నాడట.. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇక పార్టీ దుకాణం మూసుకునే పరిస్థితి వస్తుందని ఆందోళనగా ఉన్నాడట.. అందుకే మంచి మెరుగైన నేతలను ఎంపిక చేసుకొని తన వెంట ఉంచుకోవాలని.. అతిగా మాట్లాడే వాళ్లను ప్రోత్సహించవద్దని డిసైడ్ అయ్యాడట.. వాళ్ల వల్ల మిగతా నేతలు దూరం అవుతున్నారని.. పార్టీ నాశనం అవుతోందని లోకేష్ బలంగా నమ్ముతున్నాడట..

కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ మహేశ్వరరావుకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి హైలెట్ చేశాడని లోకేష్ గుర్తించాడట.. దేవినేనికి ఆ జిల్లాలో ఉన్న ఎవరికి పడదని తేల్చాడట.. దేవినేనికి ఇగో ఎక్కువని.. అతడు ఎవరిని కలుపుకొని పోడు అని రిపోర్టులు లోకేష్ కు అందాయట..

ఈ సర్వేలన్నీ చంద్రబాబు ముందుంచగా.. అవన్నీ ట్రాష్ అని కొట్టిపారేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. లోకేష్ మాత్రం దేవినేనిని కొన్ని రోజులు పక్కనపెట్టి సైలెంట్ గా ఉండమని చెబుతామని.. జిల్లాలో వేలు పెట్టవద్దని సూచిద్దామని చంద్రబాబుకు విన్నవించాడట.. కానీ చంద్రబాబు పట్టించుకోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దేవినేని విషయంలో తండ్రీకొడుకులు చంద్రబాబు-లోకేష్ ల మధ్య పెద్ద ఎత్తున ఇంట్లో వాగ్యూద్ధం జరిగిందని.. ఆ తరువాత హైదరాబాద్ నుంచి లోకేష్ విజయవాడకు వచ్చాడని సమాచారం. దీంతో చంద్రబాబు మళ్లీ కూర్చొని మాట్లాడుదాం అని లోకేష్ కు కబురు పంపితే అప్పుడు చల్లబడి హైదరాబాద్ వెళ్లాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

దీంతో 2024 ఎన్నికల కోసం లోకేష్ బాగానే కష్టపడుతున్నాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు మీద లోకేష్ అలకపాన్పు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆ నోటా ఈ నోటా ఇది బయటపడుతోంది.