Begin typing your search above and press return to search.

సీరమ్ టీకా బయటకొచ్చింది.. ట్రక్కుల్లో బయలుదేరాయి

By:  Tupaki Desk   |   12 Jan 2021 11:36 AM IST
సీరమ్ టీకా బయటకొచ్చింది.. ట్రక్కుల్లో బయలుదేరాయి
X
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ నెల పదహారు నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించటం.. అందులో భాగంగా సీరం.. భారత్ బయోటెక్ కు చెందిన రెండు వ్యాక్సిన్లను ఇవ్వాలనుకోవటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా తొలిదశలో వైద్యులు.. వైద్య సిబ్బంది.. ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు ఇచ్చేందుకు అవసరమైన వ్యాక్సిన్ పెట్టెల్ని ఈ రోజు పుణెలోని తయారీ కేంద్రం నుంచి మూడు ప్రత్యేక ట్రక్కుల్లో పంపిణీ షురూ చేశారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య సీరం కంపెనీ నుంచి విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు. వ్యాక్సిన్ స్టాక్ రవాణా కోసం జీపీఎస్ ట్రాక్ చేసేందుకు వీలున్న వాహనాల్ని వినియోగించారు. మొత్తం 478 బాక్సుల్లో టీకాల్ని భద్రంగా ఉంచారు. ఒక్కో బాక్సు బరువు 32 కేజీలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

తొలి విడత డోసుల్ని ఫుణె.. ఢిల్లీ.. అహ్మదాబాద్.. కోల్ కతా.. చెన్నై.. బెంగళూరు.. కర్నాల్.. హైదరాబాద్.. విజయవాడ.. గువాహటి.. లక్నో.. చండీగఢ్.. భువనేశ్వర్ లకు పంపిణీ చేయనున్నారు. పుణె నుంచి తొలి కార్గో విమానం హైదరాబాద్.. విజయవాడ..భువనేశ్వర్ లకు రానున్నాయి. మరొకటి కోల్ కతా.. గువాహటి ప్రాంతాలకు పంపుతున్నారు. ముంబయికివెళ్లాల్సిన స్టాక్ ను మాత్రం రోడ్డు మార్గంలో సరఫరా చేయనున్నారు. వ్యాక్సిన్ రవాణా కోసం ఎయిరిండియా.. గో ఎయిర్.. ఇండిగో.. స్పైస్ జెట్ విమనాల్ని వినియోగించనున్నారు. ఇక.. గట్టిగా ఊపిరి పీల్చుకోవచ్చుగా..?